జపాన్‌లో పండే అరుదైన రకం మామిడి పండ్లు ఇప్పుడు ఏపీలో కూడా పండుతున్నాయి. మార్కెట్లో కిలో రూ.2.70 లక్షలు పలికే ఈ మామిడి పండ్లను ఇప్పుడు ఏపీలోని ఓ బిజినెస్‌మెన్ పండిస్తున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా.. ఈ అరుదైన రకం మామిడి చెట్టును తన ఇంట్లో పెంచుతున్నారు. ఇంతకీ ఆ అరుదైన మామిడి స్పెషాలిటీ ఏంటి. దానికి ఎందుకు అంత ధర. దాని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హైలైట్:
- ఏపీలో పండుతున్న జపాన్ మియాజాకీ మామిడి
- అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ.2.70 లక్షలు
- టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంట్లో చెట్టు

ఆ 10 మొక్కల్లో కొన్ని ఫాంహౌస్‌లో మరికొన్ని తన ఫ్రెండ్స్ ఇళ్లలో పెట్టినట్లు చెప్పారు. 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల వయసు ఉన్న మొక్కను తెచ్చి పెట్టామని.. ఇప్పుడు అన్నీ కాపు కాశాయని పేర్కొన్నారు. ఇవి సాధారణ మామిడి పండ్లలా కాకుండా చాలా భిన్నమైన రుచి కలిగి ఉన్నాయని తెలిపారు. తన ఫాంహౌస్‌లో 3 మియాజాకీ మామిడి చెట్లను పెంచగా.. మొత్తం కలిపి 100 మామిడికాయలు వచ్చినట్లు చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఒక రైతు ఈ మియాజాకీ మామిడి పండ్లను సాగు చేసి.. ఒక్కో మామిడిపండును రూ.10 వేలకు విక్రయించారు. తిరుపతి, కడప రైతులు కూడా వీటిని పండించేందుకు రెడీ అవుతున్నారు.
అదే సమయంలో విజయవాడ నగరంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు.. తన ఇంట్లో కూడా ఈ మియాజాకీ మామిడి చెట్టును పెంచుతుండటం విశేషం. ఈ మియాజాకీ మామిడి పండ్లను కొనుగోలు చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. సాధారణంగా మామిడి పండ్లు కిలోకు రూ.150 నుంచి మొదలవుతాయి. కానీ ఈ మియాజాకీ మామిడి పండ్లు కిలోకు ఏకంగా అక్షరాలా రూ.2.70 లక్షలు కావడంతో సామాన్య ప్రజలు కొనే పరిస్థితి లేదు. జపాన్‌లో ఈ మియాజాకీ మామిడి పండ్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి వేలం పాట వేసి విక్రయిస్తారు. ఈ మియాజాకీ మామిడి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతారు.


