Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Electric Bike: మార్కెట్లోకి ఓబెన్ సరికొత్త స్పోర్టీ ఎలక్ట్రిక్ బైక్.. అదిరిపోయే లుక్స్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్!

1 May 2026

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. నేటి నుంచి బుకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఇక నుంచి..

1 May 2026

Chandrababu Public Feedback On Mlas Performance,టార్గెట్ 2029.. ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు ప్రజాభిప్రాయ సేకరణ.. – cm chandrababu to seek public feedback on the performance of tdp mlas in andhra pradesh

1 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Ration No Kandipappu In May Month,రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.. ఈ నెల కూడా లేనట్లే, ఆ మూడు మాత్రమే ఇస్తారు – kandipappu shortage for ration card holders in ration distribution for may 2026 also at andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Ration No Kandipappu In May Month,రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.. ఈ నెల కూడా లేనట్లే, ఆ మూడు మాత్రమే ఇస్తారు – kandipappu shortage for ration card holders in ration distribution for may 2026 also at andhra pradesh

.By .1 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Ration No Kandipappu In May Month,రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.. ఈ నెల కూడా లేనట్లే, ఆ మూడు మాత్రమే ఇస్తారు – kandipappu shortage for ration card holders in ration distribution for may 2026 also at andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Ration Distribution No Toor Dal In May Month: ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి మే నెలలో కూడా నిరాశ తప్పలేదు. ఈ నెల కూడా రేషన్ పంపిణీలో కందిపప్పు లేనట్లే.. ఈ నెల కూడా కందిపప్పు స్టాక్ రాలేదని చెబుతున్నారు. కొన్ని నెలలుగా రేషన్‌కార్డులు ఉన్నవారు కందిపప్పు కోసం ఎదురు చూస్తుండగా మరోసారి నిరాశ ఎదురైంది. టెండర్ల విషయంలో ఆలస్యం కావడంతో కందిపప్పు స్టాక్ రాలేదని చెబుతున్నారు.

హైలైట్:

  • ఏపీలో ప్రారంభమైన రేషన్ పంపిణీ
  • ఈ నెల కూడా కందిపప్పు లేనట్లే
  • స్టాక్ రాలేదని చెబుతున్న డీలర్లు
Andhra Pradesh Ration Distribution Toor Dal
ఏపీ రేషన్ పంపిణీలో కందిప్పు లేవు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు ఉన్నవారికి ఈ నెల కూడా నిరాశ తప్పలేదు. మే నెలకు సంబంధించి రేషన్‌లో కూడా కందిపప్పు అందుబాటులోకి రాలేదు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ మొదలైంది.. ఈ నెల కూడా బియ్యం, చక్కెర పంపిణీ చేస్తుండగా.. కొన్నిచోట్ల మాత్రమే గోధుమపిండి, రాగులు, జొన్నలు పంపిణీ చేస్తున్నారు. మే నెలలో కందిపప్పు అందుబాటులోకి వస్తాయని భావించగా ఈసారి కూడా స్టాక్ రాలేదు. బయట మార్కెట్‌లో కందిపప్పు ధర ఎక్కువగా ఉండటంతో సామాన్యులకు కాస్త భారంగా మారింది. అందుకే రేషన్‌ షాపుల్లో కందిపప్పును పంపిణీ చేస్తే బావుంటుంది అంటున్నారు. చాలా నెలలుగా కందిపప్పు అందుబాటులోకి రావడం లేదని.. వచ్చే నెలలోనైనా కందిప్పును పంపిణీ చేస్తారని చూస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కందిపప్పుతో పాటు పామాయిల్, గోధుమలు, రాగులు, జొన్నలు పంపిణీ పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని భావిస్తోంది. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.. కందిపప్పు సహా మిగిలిన నిత్యావసరాలు అందుబాటులోకి రావడం లేదు. అయితే టెండర్ల ప్రక్రియలో ఆలస్యం కావడంతో వచ్చే నెల నుంచి పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. కొన్ని నెలలుగా కందిపప్పు సరఫరా లేకపోవడంతో రేషన్‌కార్డులు ఉన్నవారు ఎదురు చూస్తున్నారు. ఈ నెల కూడా బియ్యం, చక్కెరతో సరిపెడుతున్నారు. కేజీ గోధుమ పిండిని కూడా పంపిణీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో కొన్ని నెలల పాటూ కందిప్పు పంపిణీ చేశారు.. కానీ ఆ తర్వాత ఆగిపోయింది.

ఏపీ ప్రభుత్వం రేషన్ పంపిణీలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రేషన్ డోర్ డెలివరీని, ఎండీయూ వాహనాలను రద్దు చేసి.. మళ్లీ పాతన విధానంలోనే రేషన్ షాపుల దగ్గర సరుకుల్ని పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం రేషన్‌ను వారి ఇళ్ల దగ్గర అందజేసే ఏర్పాటు చేసింది. రేషన్ డీలర్ ద్వారా ప్రతి నెలా సరుకుల్ని హోమ్ డెలివరీ చేయిస్తోంది. రేషన్ షాపుల్లో ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్‌ను పంపిణీ చేస్తున్నారు. ఆదివారాలు కూడా రేషన్ షాపులు అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాదు ఏపీ ప్రభుత్వం గతేడాది స్మార్ట్ రేషన్ కార్డుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్‌లో అక్రమాలకు చెక్ పెడుతోంది. రేషన్ డీలర్లకు కొత్త ఈపోస్ యంత్రాలు అందుబాటులోకి తీసుకొచ్చి సిగ్నల్ సమస్యలు లేకుండా చేశారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.

తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి