Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మాజీ భర్త రూ.30,000 కోట్ల ఆస్తుల వివాదం.. క‌రిష్మా క‌పూర్‌కు ఊర‌ట

2 May 2026

ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్..!! | airindia Curtails International Flights Until July 2026 Major Decision by Leading Airline AirIndia

2 May 2026

Tollywood: చిరంజీవితో ఉన్నఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరో.. యాంకర్ కూడా..

2 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Snake Bite: పాము కాటేసిన వెంటనే ఏం చేయాలో తెలుసా..? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే రిస్క్..
తాజా వార్తలు

Snake Bite: పాము కాటేసిన వెంటనే ఏం చేయాలో తెలుసా..? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే రిస్క్..

.By .2 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Snake Bite: పాము కాటేసిన వెంటనే ఏం చేయాలో తెలుసా..? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే రిస్క్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఎండలు ముదురుతుండటంతో పాములు తమ ఆవాసాలను వదిలి చల్లని ప్రాంతాల కోసం ఇళ్లలోకి, తోటల్లోకి వస్తున్నాయి. ఫలితంగా పాముకాటు సంఘటనలు గణనీయంగా పెరుగుతున్నాయి. కేవలం కేరళ రాష్ట్రంలోనే గడిచిన ఏప్రిల్ నెలలో 49 మంది పాముకాటుకు గురై మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో పాముల పట్ల అపోహలు తొలగించడానికి, బాధితులకు ప్రాణాపాయం కలగకుండా ఉండటానికి తమిళనాడు అటవీ శాఖ ఒక ప్రత్యేక పుస్తకాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.

అన్ని పాములూ విషపూరితమైనవి కావు

పామును చూడగానే చాలామంది భయాందోళనలకు గురవుతారు. అయితే మనకు కనిపించే అన్ని పాములూ విషపూరితమైనవి కావు. ఉదాహరణకు.. అత్యంత భయంకరంగా కనిపించే కొండచిలువ వాస్తవానికి విషరహితమైనది. పాముల గురించి అవగాహన లేకపోవడమే ఈ అనవసర భయానికి కారణమని సర్పశాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పాము కాటు వేస్తే.. వెంటనే చేయాల్సిన పనులు

పాము కాటు వేసినప్పుడు మొదటి నిమిషం చాలా కీలకం. ఆ సమయంలో కంగారు పడకుండా ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు:

కదలకుండా ఉండాలి: పాము కాటు వేసిన తర్వాత బాధితుడు పరుగెత్తడం లేదా వేగంగా నడవడం చేయకూడదు. శరీరం ఎంత ఎక్కువగా కదిలితే, రక్త ప్రసరణ అంత వేగంగా జరిగి విషం గుండెకు, మెదడుకు త్వరగా చేరుతుంది.

తేలికపాటి కట్టు: కాటు వేసిన ప్రదేశానికి సుమారు 6 అంగుళాల పైన ఒక తాడు లేదా రిబ్బన్‌తో తేలికగా కట్టాలి. ఇది విషం శరీరమంతా వ్యాపించకుండా నెమ్మదింపజేస్తుంది.

వైద్య సహాయం: ఏమాత్రం ఆలస్యం చేయకుండా 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయాలి లేదా సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు: చిన్న గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా పాముకాటు విరుగుడు మందులు అందుబాటులో ఉంటాయి.

అస్సలు చేయకూడని తప్పులు

విషాన్ని పీల్చడం: సినిమాల్లో చూపించినట్లు నోటితో విషాన్ని పీల్చే ప్రయత్నం చేయకూడదు. ఇది బాధితుడికే కాకుండా, చేసే వ్యక్తికి కూడా ప్రమాదకరం.

నాటు వైద్యం: పాము కాటుకు మంత్రాలు, తాయెత్తులు లేదా ఆకు పసరు వంటి నాటు వైద్యం చేయించుకుని కాలాన్ని వృథా చేయకండి. అది ప్రాణాల మీదికి తెస్తుంది.

పామును పట్టుకోవడం: కాటు వేసిన పామును పట్టుకోవడానికి లేదా కొట్టడానికి ప్రయత్నించి సమయాన్ని వృథా చేయవద్దు. ఒకవేళ వీలైతే దూరం నుండి ఫోటో తీయండి, అది వైద్యులకు చికిత్సలో సహాయపడుతుంది.

పాములు ఇళ్లలోకి రాకుండా ఉండాలంటే..?

  • ఇంటి చుట్టుపక్కల చెత్తాచెదారం, ఎండుటాకులు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.
  • పాత టైర్లు, కట్టెలు, రాళ్ల కుప్పలు పాములకు నివాసాలుగా మారతాయి.. కాబట్టి వాటిని తొలగించాలి.
  • కిటికీలు, తలుపుల కింద ఉండే సందులను మూసివేయాలి.
  • ఎలుకలు ఎక్కువగా ఉంటే పాములు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఎలుకల నివారణకు చర్యలు తీసుకోవాలి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

మాజీ భర్త రూ.30,000 కోట్ల ఆస్తుల వివాదం.. క‌రిష్మా క‌పూర్‌కు ఊర‌ట

2 May 2026

ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్..!! | airindia Curtails International Flights Until July 2026 Major Decision by Leading Airline AirIndia

2 May 2026

Tollywood: చిరంజీవితో ఉన్నఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరో.. యాంకర్ కూడా..

2 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మాజీ భర్త రూ.30,000 కోట్ల ఆస్తుల వివాదం.. క‌రిష్మా క‌పూర్‌కు ఊర‌ట

2 May 2026

ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ మరణం తరువాత ఆయన ఆస్తి విషయంలో వారసుల మధ్య వివాదం తలెత్తింది. దాదాపు 30…

ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్..!! | airindia Curtails International Flights Until July 2026 Major Decision by Leading Airline AirIndia

2 May 2026

Tollywood: చిరంజీవితో ఉన్నఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరో.. యాంకర్ కూడా..

2 May 2026

Devi Movie: దేవి సినిమాలో విలన్ కేరళలలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్.. ఇప్పుడేం చేస్తున్నారంటే..

2 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మాజీ భర్త రూ.30,000 కోట్ల ఆస్తుల వివాదం.. క‌రిష్మా క‌పూర్‌కు ఊర‌ట

2 May 2026

ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్..!! | airindia Curtails International Flights Until July 2026 Major Decision by Leading Airline AirIndia

2 May 2026

Tollywood: చిరంజీవితో ఉన్నఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరో.. యాంకర్ కూడా..

2 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.