Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

SBI FD Interest: ఎస్‌బీఐ 444 రోజుల ఎఫ్‌డీలో రూ.2,50,000 పెట్టుబడిపై మీకు ఎంత వడ్డీ లభిస్తుంది?

7 May 2026

డచ్ వారసత్వానికి ప్రతీక. సముద్ర గర్భంలో శత్రువులకు సమాధి! | Dutch Frigate HNLMS De Ruyter Arrives in Kochi: Strengthening Indo-Dutch Maritime Defense Cooperation.

7 May 2026

Actress Rambha : ఆ హీరో ప్రపంచంలోనే బెస్ట్ డ్యాన్సర్.. అతడు ఎంతో కష్టపడితే పేరు నాకొచ్చింది.. హీరోయిన్ రంభ..

7 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vijay Tvk Coalition Party,విజయ్.. ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకో.. టీవీకే చీఫ్‌కు విజయసాయిరెడ్డి సలహాలు.. – vijayasai reddy advice to tvk chief vijay on which party to form a coalition in tamil nadu
ఆంధ్రప్రదేశ్

Vijay Tvk Coalition Party,విజయ్.. ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకో.. టీవీకే చీఫ్‌కు విజయసాయిరెడ్డి సలహాలు.. – vijayasai reddy advice to tvk chief vijay on which party to form a coalition in tamil nadu

.By .5 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vijay Tvk Coalition Party,విజయ్.. ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకో.. టీవీకే చీఫ్‌కు విజయసాయిరెడ్డి సలహాలు.. – vijayasai reddy advice to tvk chief vijay on which party to form a coalition in tamil nadu
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Vijayasai Reddy advice to TVK Vijay: తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో.. విజయ్ ఏ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీవీకే చీఫ్ విజయ్‌కు కొన్ని సలహాలు ఇచ్చారు. విజయం తర్వాత ఇకపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై రెండు సలహాలు అందించారు విజయసాయిరెడ్డి. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరోవైపు మే ఏడో తేదీ తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

హైలైట్:

  • విజయ్‌కు విజయసాయిరెడ్డి సలహాలు
  • ఇకపై ఎలా నడుచుకోవాలో చెప్తూ సలహాలు
  • ఏ పార్టీతో పొత్తు మంచిదో చెప్పిన విజయసాయిరెడ్డి
Vijayasai Reddy advice to TVK Vijay
విజయ్‌కు విజయసాయిరెడ్డి సలహాలు(ఫోటోలు– Samayam Telugu)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడటంతో.. టీవీకే చీఫ్ విజయ్ ఏం చేస్తారనేదీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విజయ్‌కు చెందిన టీవీకే పార్టీకి ఎన్నికల్లో 108 సీట్లు వచ్చాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలంటే విజయ్ పార్టీకి మరో పదిమంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయ్ ఏ రాజకీయ పార్టీతో కలిసి ముందుకెళ్తారనేదీ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీవీకే చీఫ్ విజయ్‌కు రెండు సలహాలు అందించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ గెలుపు.. తమిళనాడు ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అద్దం పడుతోందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ద్రవిడ పార్టీలతో విసుగుచెందటంతో పాటుగా.. యువ ఓటర్ల ఆదరణ, సినీ పాపులారిటీ విజయ్ విజయానికి కారణాలుగా విజయసాయిరెడ్డి విశ్లేషించారు. ఈ క్రమంలోనే ఇకపై ఎలా ముందుకు ఎలా వెళ్లాలనే దానిపై విజయ్‌కు కొన్ని సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తమిళనాడు ప్రజలు అందించిన ఈ అపూర్వ విజయాన్ని సుపరిపాలనగా మార్చాలంటే.. విజయ్ ముందుగా ఒక అనుభవజ్ఞులైన, సమర్థవంతమైన బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు. అలాగే ఎన్నికల సమయంలో ప్రజలకు తాను ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయటంలో సహాయపడే పార్టీతోనే పొత్తు పెట్టుకోవాలని టీవీకే చీఫ్ విజయ్‌కు విజయసాయిరెడ్డి సూచించారు. అయితే హామీ అమలులో సహాయపడే పార్టీతో పొత్తు అంటూ విజయసాయిరెడ్డి సలహా ఇవ్వటంపై నెటిజన్లు భిన్న కామెంట్లు చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను సమర్థంగా అమలు చేయాలంటే.. కేంద్ర ప్రభుత్వం సహకారం, నిధులు అవసరమని.. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి పరోక్షంగా బీజేపీతో పొత్తుపెట్టుకోమని చెప్తున్నారా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో లేదు. కేంద్రం నుంచి సహకారం లభించాలంటే బీజేపీ లేదా ఎన్డీఏ కూటమితో ముందుకెళ్లాలని చెప్పటమే విజయసాయిరెడ్డి ఉద్దేశమా అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మే 7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం

మరోవైపు మే ఏడో తేదీన చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. బుధవారం రోజున విజయ్ గవర్నర్‌ను కలవనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీతో కలిసి వెళ్తారనేదీ ఆసక్తికరంగా మారింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి