Medicines: వయసు పైబడిన వారు రోగాల బారిన పడటం సహజం.. కానీ ఆ రోగాల నుంచి ఉపశమనం కోసం వాడే మందులే ఇప్పుడు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో పాలీఫార్మసీ ఇబ్బంది పెడుతుంది.ఒకేసారి ఎక్కువ రకాల మందులు వాడటం పాలీఫార్మసీ అంటారు. ఇది ఈ మధ్య విపరీతంగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మెడికల్ కాలేజీ పరిశోధక బృందం ఏడాది పాటు నిర్వహించిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధ్యయనంలో పాల్గొన్న వృద్ధుల్లో 64 శాతం మందికి డ్రగ్ రియాక్షన్ ముప్పు పొంచి ఉంది.ఎంత ఎక్కువ మెడిసిన్ వాడతారో ఈ ఎఫెక్ట్ అంత ఎక్కువగా ఉంటుంది.వృద్ధులు సగటున 7.4 రకాల మందులను వాడుతున్నారు. ఇందులో 24 శాతం మంది వృద్ధులు రోజుకు 10 కంటే ఎక్కువ మందులు వేసుకుంటున్నారు. మందుల మధ్య జరిగే రసాయనిక చర్యల వల్ల 17.6 శాతం మందిలో ఈ రియాక్షన్ అత్యంత ప్రమాదకరంగా ఉంది.కొన్ని రకాల మందులను కలిపి వాడటం వల్ల శరీరంలో విషతుల్యమైన మార్పులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు
ఇది కూడా చదవండి: Air Cooler: కూలర్ నుండి చేపల వాసన వస్తోందా? కేవలం ఈ ఒక్క వస్తువుతో మీ గదిని సువాసనలతో నింపేయండి!
1. ఆస్పిరిన్ + క్లోపిడోగ్రెల్: గుండె సంబంధిత సమస్యల కోసం ఈ రెండూ కలిపి వాడితే రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది.
2. ఇన్సులిన్ + బీటా-బ్లాకర్స్: షుగర్ లెవల్స్ పడిపోయినప్పుడు వచ్చే హెచ్చరిక లక్షణాలను బీటా-బ్లాకర్స్ అణచివేస్తాయి. దీనివల్ల రోగి కోమాలోకి వెళ్లే ఛాన్స్ ఉంది.
3. ఇన్హిబిటర్లు + పొటాషియం: వీటివల్ల రక్తంలో పొటాషియం స్థాయి పెరిగి నేరుగా గుండెపై ప్రభావం పడుతుంది.
* కళ్లు తిరగడం, తీవ్రమైన అలసట, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.
* శరీర సమతుల్యత దెబ్బతిని కిందపడిపోయే ప్రమాదం ఉంది.
* ఒక మందు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్‌ను మరో వ్యాధిగా భ్రమపడి, మరిన్ని కొత్త మందులు వాడటం వల్ల రోగిపై ఆర్థిక భారం కూడా పెరుగుతుంది.
మందులు రాసే ముందు పాత ప్రిస్క్రిప్షన్లను వైద్యులకు చూపించాలి. అవసరం లేని మందులను తగ్గించుకోవడమే ఉత్తమమని డాక్టర్ లు తెలుపుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల కారణంగా మందులు ధరలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని మందుల ధరలు పెరిగాయి. దీంతో పేషెంట్లకు ఆర్థిక భారం తప్పడం లేదు.
ఇది కూడా చదవండి: Gold Jewellery: తులం బంగారంతో నగలు చేయిస్తే ఎంత తరుగు పోతుంది? ఎవ్వరికి తెలియని ఛార్జీల సీక్రెట్ ఇదే.!

