Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

సరదాగా, జాలీగా.. జూన్‌లో తప్పక చూడాల్సిన చల్ల చల్లని ప్రదేశాలు ఇవే!

30 May 2026

AP El Nino 2026: ఏపీకి ఎల్ నినో ముప్పు తీవ్రమే ? నిపుణుల తాజా వార్నింగ్..! | El Nino Won’t Spare Andhra Pradesh: Experts Warn of Heatwaves, Falling Groundwater

30 May 2026

పెళ్లి భోజనాల్లో వడ్డించే అసలైన వెజిటేబుల్ పులావ్ ఇదే.. ఈ సీక్రెట్ తెలిస్తే నిమిషాల్లోనే చేసుకోవచ్చు..

30 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pawan Kalyan On Tamil Nadu Cm Vijay,ఊర్లో పెళ్లికి అదేదో హడావిడి.. తమిళనాడులో విజయ్ గెలుపుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు – ap deputy cm pawan kalyan on his health and tamil nadu cm vijay
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan On Tamil Nadu Cm Vijay,ఊర్లో పెళ్లికి అదేదో హడావిడి.. తమిళనాడులో విజయ్ గెలుపుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు – ap deputy cm pawan kalyan on his health and tamil nadu cm vijay

.By .15 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pawan Kalyan On Tamil Nadu Cm Vijay,ఊర్లో పెళ్లికి అదేదో హడావిడి.. తమిళనాడులో విజయ్ గెలుపుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు – ap deputy cm pawan kalyan on his health and tamil nadu cm vijay
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Pawan kalyan with janasena : తమిళనాడులో విజయ్ గెలుపుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో జనసేన కార్యకర్తలతో పవన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి, సీఎం పదవి గురించి, తమిళనాడులో విజయ్ గెలుపు గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలు వేరన్న పవన్ కళ్యాణ్.. 2019లో తాను రెండు చోట్లా ఓడిపోయిన సంగతిని గుర్తు చేశారు.

హైలైట్:

  • జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం
  • ఆరోగ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్
  • తమిళనాడులో విజయ్ గెలుపుపైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Pawan
జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం(ఫోటోలు– Samayam Telugu)
జనసేన కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన ఉద్యమి సభ్యత్వాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన “జనసేన సాధక్”లతో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన అనారోగ్యానికి కారణాలను వెల్లడించారు. తనకు కరోనా సోకటంతో పాటుగా.. ఎన్నికలకు ఏడాది ముందు నుంచీ దుమ్మూ, ధూళిలో తిరగడం వలన లంగ్ ఇన్ఫెక్షన్ అయ్యిందని పవన్ కళ్యాణ్ వివరించారు. అది అలాగే ఉండిపోయిందని, సైనస్ సమస్య కూడా తీవ్రమైందన్నారు. ఓ రోజు కంటి చూపులో కూడా తేడా వచ్చిందని.. అందుకే అన్ని కార్యక్రమాలు వదిలేసి హైదరాబాద్ వచ్చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. హైదరాబాద్‌లో డాక్టర్లు పరీక్షలు చేస్తే.. రెండు భుజాల మధ్యన టేర్ వచ్చినట్లు తేలిందన్నారు. అయితే ట్రైనింగ్ ఉండటం వలన తన శరీరం అన్నింటిని తట్టుకోగలదని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. అభిమానుల ప్రార్థనలు, దీవెనలతో కోలుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. . పాతికేళ్లుగా తనలో రగిలిన ఆలోచనే జనసేన పార్టీగా అభివర్ణించిన పవన్ కళ్యాణ్.. సీఎం కావాలని తాను పార్టీ పెట్టలేదన్నారు. అలాగే తమిళనాడు టీవీకే విజయ్ గెలుపుపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“పక్క రాష్ట్రంలో ఓ వ్యక్తి పార్టీ పెట్టి విజయం సాధించి, ముఖ్యమంత్రి కాగానే.. మన ఆంధ్రప్రదేశ్‌లో మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని నాకు చాలా మంది మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఊర్లో పెళ్లికి అదేదో హడావిడి అన్నట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు, 2019లో ఒంటరిగా పోటీ చేస్తే రెండుచోట్లా ఓడించారు. ఆ రోజు ఎవరైనా నిలబడ్డారా అంటే అందరూ పారిపోయారు. పదవి నాకు ప్రధానం కాదు. 2014లో నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయాల్సి ఉండేది. కానీ పోటీ చేయలేదు. పార్టీ నిర్మాణం గురించి ఆలోచించా” అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి