Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Fruit Storage Tips: ఈ 9 రకాల పండ్లను అస్సలు ఫ్రిజ్‌లో పెట్టవద్దు.. చాలా మంది చేసే తప్పు ఇదే

13 June 2026

పెళ్లి పత్రికలో సైబర్ మోసాల హెచ్చరికలు.. అనంతపురం తండ్రి వినూత్న ఆలోచనకు ప్రశంసల వెల్లువ!

13 June 2026

ఈ నెల 15 నుండి పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పండుగే! | Telangana govt to launch Alpaharam Scheme for students in 1269 schools and 33 inter colleges

13 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Mental Krishna: ‘నేను నైటీ వేసుకోలేను’.. పోసాని ‘మెంటల్ కృష్ణ’ మూవీని రిజెక్ట్ చేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా?
తాజా వార్తలు

Mental Krishna: ‘నేను నైటీ వేసుకోలేను’.. పోసాని ‘మెంటల్ కృష్ణ’ మూవీని రిజెక్ట్ చేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా?

.By .18 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Mental Krishna: ‘నేను నైటీ వేసుకోలేను’.. పోసాని ‘మెంటల్ కృష్ణ’ మూవీని రిజెక్ట్ చేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో పోసాని కృష్ణమురళి ఒకరు. 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పని చేసిన ఆయన నటుడిగానూ, డైరెక్టర్ గానూ సత్తా చాటాడు. ముఖ్యంగా పోసాని దర్శకత్వంలో వచ్చిన ఆపరేషన్ ధుర్యోధన సినిమా అప్పట్లో ఒక పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. దీంతో పాటు శ్రావణ మాసం, ఆపద మొక్కుల వాడు, మెంటల్ కృష్ణ, రాజావారి చేపల చెరువు, దుశ్వాసన వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇందులో మెంటల్ కృష్ణ అనే సినిమాలో పోసాని హీరోగా నటించాడు. అతని పక్కన సత్య కృష్ణన్ కథానాయికగా చేసింది. బ్రహ్మానందం, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకం క్రింద వడ్లపట్ల మోహన్ నిర్మించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించాడు. 2009 జనవరి 01న విడుదలైన మెంటల్ కృష్ణ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ఈ సినిమా పలు రకాలుగా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఇందులో పోసాని గెటప్పులు అందరి దృష్టిని ఆకర్షించాయి. అందులోనూ ఈ సినిమాలోని చాలా సన్నివేశాల్లో నైటీలో కనిపిస్తాడు పోసాని.

బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచిన ఈ మెంటల్ కృష్ణ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు పోసాని. అదేంటంటే..ఈ సినిమాను మొదట వేరే హీరోతో అనుకున్నారట పోసాని. అయితే అతను ఒప్పుకోకపోవడంతో అతనే హీరోగా చేశారట. ఆ హీరో మరెవరో కాదు వేణు తొట్టెంపూడి. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన పోసాని తన మెంటల్ కృష్ణ సినిమా గురించి ఇలా చెప్పుకొచ్చారు. ‘ మెంటల్ కృష్ణ సినిమా ఒక హీరో కథ. వేణు కోసమే ఈ కథ రాశాను. చూడ్డానికి ఒడ్డూ, పొడవు బాగుంటాడని, వాకింగ్ స్టైల్ కూడా చక్కగా ఉంటుందని అతని కోసమే ఈ స్టోరీ రాసి పెట్టాను. కథ కూడా వినిపించాను. వేణు కూడా చాలా బాగా నచ్చిందన్నాడు. అయితే నైటీ వేసుకోలేనని సినిమాను రిజెక్ట్ చేశాను. ఆ విషయాన్ని నేను నిర్మాతలకు చెప్పాను. సినిమాను ఆపేద్దామన్నాను. కానీ నిర్మాత మాత్రం సినిమాను ఎందుకు ఆపేస్తారు? మీరే ఆ రోల్ చేయండి. దీంతో నేనే లీడ్ రోల్ చేశాను. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. మొదటి రోజు ఫస్ట్ మార్నింగ్ షోకే మేం పెట్టిన డబ్బులు వచ్చేశాయి. ఆ తర్వాత 30 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. అయితే నైటీలు, చీరలు వేసినంత మాత్రాన సినిమాలు ఆడవు. కథ బాగుంటేనే హిట్ అవుతాయి’ అని పోసాని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Fruit Storage Tips: ఈ 9 రకాల పండ్లను అస్సలు ఫ్రిజ్‌లో పెట్టవద్దు.. చాలా మంది చేసే తప్పు ఇదే

13 June 2026

ఈ నెల 15 నుండి పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పండుగే! | Telangana govt to launch Alpaharam Scheme for students in 1269 schools and 33 inter colleges

13 June 2026

Indian Railways: రైళ్ల ద్వారా ఏసీ, ఫ్రిజ్ లాంటి పరికరాలు పంపించవచ్చా..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

13 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Fruit Storage Tips: ఈ 9 రకాల పండ్లను అస్సలు ఫ్రిజ్‌లో పెట్టవద్దు.. చాలా మంది చేసే తప్పు ఇదే

13 June 2026

ఆరోగ్య నివేదికల ప్రకారం కొన్ని పండ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల వాటి సహజ సిద్ధమైన రుచి క్రమంగా తగ్గిపోతుంది. అంతేకాకుండా…

పెళ్లి పత్రికలో సైబర్ మోసాల హెచ్చరికలు.. అనంతపురం తండ్రి వినూత్న ఆలోచనకు ప్రశంసల వెల్లువ!

13 June 2026

ఈ నెల 15 నుండి పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పండుగే! | Telangana govt to launch Alpaharam Scheme for students in 1269 schools and 33 inter colleges

13 June 2026

భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

13 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Fruit Storage Tips: ఈ 9 రకాల పండ్లను అస్సలు ఫ్రిజ్‌లో పెట్టవద్దు.. చాలా మంది చేసే తప్పు ఇదే

13 June 2026

పెళ్లి పత్రికలో సైబర్ మోసాల హెచ్చరికలు.. అనంతపురం తండ్రి వినూత్న ఆలోచనకు ప్రశంసల వెల్లువ!

13 June 2026

ఈ నెల 15 నుండి పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పండుగే! | Telangana govt to launch Alpaharam Scheme for students in 1269 schools and 33 inter colleges

13 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025569

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025525

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.