ఒక్క వీడియో క్లిప్‌తో వచ్చిన క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగినా, సినిమాల విషయంలో మాత్రం ఆమెకు సవాళ్లు ఎదురయ్యాయి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. తెలుగులో నితిన్ సరసన ‘చెక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానం కోసం ప్రయత్నించింది. అయితే, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఆమెకు ఆశించిన బ్రేక్ దక్కలేదు. అనంతరం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించినా, కథానాయికగా తనదైన ముద్ర వేయడానికి ఇంకా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉంది.

