నందమూరి బాలకృష్ణ, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నియర్ ఫ్యూచర్‌లో రిలీజ్ చేయబోయే సినిమాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఓ ఇంట్రస్టింగ్ డిస్కషన్‌కి తెర లేపినట్టయింది. ఒకరూ, ఇద్దరూ కాదు.. అంతకు మించే.. కెప్టెన్లు వీళ్లిద్దరు ఇచ్చే హిట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఈ వీక్ థియేటర్లలోకి వచ్చిన ఇద్దరు కెప్టెన్లు కూడా ఈ లిస్టులో కనిపించడం విశేషం.! నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్‌బీకే 109 సినిమా కీ షెడ్యూల్స్ పూర్తయినట్టే. మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేసి, నెక్స్ట్ ప్రశాంత్ వర్మ్ షూట్ కి వెళ్తారు బాలయ్య.
ఆ తర్వాత అఖండ సీక్వెల్ చేయాలి. రామ్‌తో తీసిన స్కంధ ఫ్లాప్ కావడంతో అఖండ సీక్వెల్ మీదే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు బోయపాటి శ్రీను. త్వరలోనే బాలయ్యను కలిసి పూరి జగన్నాథ్ ఓ స్క్రిప్ట్ నెరేట్ చేస్తారన్నది ఇప్పుడు వైరల్ అవుతున్న మాట.
ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఉంది. సో, పూరి చెప్పే కథ నచ్చితే వెంటనే సినిమా చేయడానికి బాలయ్య కాల్షీట్ ఇచ్చేస్తారనే మాట కూడా గట్టిగానే వైరల్ అవుతోంది. అదే జరిగితే ఇబ్బందుల్లో ఉన్న పూరి కెరీర్‌కి భరోసా కల్పించాల్సిన హీరో బాలయ్యే అవుతారు.
పవన్ కల్యాణ్ కాల్షీట్లు ఆలస్యమవుతున్నాయని, మధ్యలో రవితేజతో మిస్టర్ బచ్చన్ చేశారు హరీష్ శంకర్. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ట్రోల్స్ భారీన పడింది. ఇప్పుడు పవన్‌కల్యాణ్‌తో చేసే ఉస్తాద్ భగత్‌సింగ్ రిజల్ట్ హరీష్ కెరీర్‌కి చాలా ఇంపార్టెంట్.
అటు ఏజెంట్ సినిమాతో ఫ్లాప్ ఇచ్చిన సురేందర్ రెడ్డి కూడా నెక్స్ట్ పవన్ కల్యాణ్‌తో చేయబోయే సినిమా మీదే ఆశలు పెంచుకుంటున్నారు. ఈ సినిమా క్లిక్ అయితేనే, ఆయనకు భవిష్యత్తు మీద హోప్స్ కలిగేది.
అలాగే హరిహరవీరమల్లు డైరక్టర్లు క్రిష్, జ్యోతికృష్ణ ఫ్యూచర్ కూడా చాలా వరకు పవన్ కల్యాణ్ ఇచ్చే హిట్ మీద ఆధారపడి ఉందన్నది కాదనలేని విషయం.








