Rompicherla Father Daughter SSC Results: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో కాకినాడకు చెందిన ఎల్లా నేహాంజని 600/600 మార్కులు సాధించగా, పల్నాడు జిల్లాకు చెందిన పావనీచంద్రిక ప్రభుత్వ పాఠశాలల నుంచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిగా నిలిచింది. చిత్తూరు జిల్లాలో తండ్రీకూతురు ఒకేసారి టెన్త్ పాసయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కవలలకు సమానంగా 582 మార్కులు రావడం విశేషం. ఫలితాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫస్ట్ డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించారు.
హైలైట్:
- ఏపీలో పది పరీక్షా ఫలితాల్లో విచిత్రం
- ఒకేసారి టెన్త్ పాసైన తండ్రీకూతురు
- చిత్తూరు జిల్లా రొంపిచర్లలో విచిత్రం

షబ్బీర్ కుటుంబ పరిస్థితుల రీత్యా చదువు కొనసాగించలేకపోయారు.. ఆయన దినసరి కూలీగా పనులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోయారు. ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు.. పెద్ద కుమార్తె సమీనా సాయంతో దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఓపెన్ స్కూల్ విధానంలో షబ్బీర్ చదివి పదో తరగతి పాసయ్యారు.. దీంతో కారుణ్య నియామకం కింద ఆర్టీసీలో షబ్బీర్‌కు ఉద్యోగం వస్తుందని చెబుతున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఏపీలో విచిత్రం.. ఒకేసారి పదోతరగతి పాసైన తండ్రీకూతురు, ఎన్ని మార్కులు వచ్చాయంటే
అంతేకాదు పార్వతీపురం మన్యం జిల్లాలో మరో విచిత్రం జరిగింది. బలిజిపేట మండలం వంతరాంకు చెందిన బెవర శరణ్ కార్తికేయ, బెవర సింధు శరణ్య కవలలు కాగా.. ఇద్దరు కవలలకు సమానంగా మార్కులు రావడం విశేషం. వీరిద్దరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. అన్నాచెల్లెళ్లు 582 మార్కులు చొప్పున సాధించారు. వారి తండ్రి రాము న్యాయవాది. తల్లి ఉమ కేజీబీవీ ఉద్యోగిని.