Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Adilabad: అయ్యో గణపతి అన్నంత పని చేశావ్ కదయ్యా.. కన్నీళ్లు ఆగవ్..

21 March 2026

తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు.. ఫ్యామిలీతో ఉస్తాద్ భగత్ సింగ్ చూసిన మెగాస్టార్..

21 March 2026

కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి.. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్స్!

21 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Nris Population,ఏపీలో NRIలు ఎంతమంది ఉన్నారో తెలుసా.. లెక్క తేలింది, ఆశ్చర్యంగా ఆ రాయలసీమ జిల్లా టాప్‌లో – andhra pradesh village and ward secretariats department survey revealed that there are 1 lakh 70 thousand nris from state
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Nris Population,ఏపీలో NRIలు ఎంతమంది ఉన్నారో తెలుసా.. లెక్క తేలింది, ఆశ్చర్యంగా ఆ రాయలసీమ జిల్లా టాప్‌లో – andhra pradesh village and ward secretariats department survey revealed that there are 1 lakh 70 thousand nris from state

.By .24 May 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Nris Population,ఏపీలో NRIలు ఎంతమంది ఉన్నారో తెలుసా.. లెక్క తేలింది, ఆశ్చర్యంగా ఆ రాయలసీమ జిల్లా టాప్‌లో – andhra pradesh village and ward secretariats department survey revealed that there are 1 lakh 70 thousand nris from state
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Nri Population: ఆంధ్రప్రదేశ్ నుండి ఉద్యోగం, చదువు కోసం విదేశాలకు వెళ్లిన వారి లెక్క తేలింది! గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఏ జిల్లా నుండి ఎంతమంది ప్రవాసాంధ్రులు ఉన్నారో తెలిసింది. గల్ఫ్ దేశాలకు వెళ్లినవారే ఎక్కువగా ఉన్నారని అంచనా వేస్తున్నారు. సంక్షేమ పథకాల కోసం ఈ సర్వే ఉపయోగపడుతుందట. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింది వివరాలు చదవండి!

హైలైట్:

  • ఏపీలో ఎన్ఆర్‌ఐల లెక్క తేలిపోయింది
  • గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సర్వే
  • రాయలసీమ జిల్లా రాష్ట్రంలోనే టాప్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ఆర్ఐలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ఆర్ఐలు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఎన్ఆర్ఐ‌లు ఎంతమంది ఉన్నారో లెక్క తేలింది. ఇటీవల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఒక సర్వే చేసింది.. ఈ సర్వేలో విదేశాల్లో ఉంటున్న ఆంధ్రుల గురించి తెలిసింది. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లిన 1,70,509 మంది ప్రవాసాంధ్రులు ఇతర దేశాల్లో ఉన్నారని తేలింది. APNRT సొసైటీ అభ్యర్థన మేరకు ఈ సర్వే నిర్వహించగా.. ప్రవాసాంధ్రులకు సంక్షేమ పథకాలు అందించడానికి ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని APNRT కోరింది.రాష్ట్రవ్యాప్తంగా 14,999 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సర్వే చేశారు.. 1,68,36,434 ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. 1,11,909 ఇళ్లలో 1,70,509 మంది ప్రవాసాంధ్రులు ఉన్నట్లు గుర్తించారు. వీరంతా ఉద్యోగం, చదువు కోసం వేర్వేరు దేశాల్లో ఉంటున్నారని వారి కుటుంబ సభ్యులు చెప్పారు. చాలామంది తమ వాళ్ళు ఏ దేశంలో ఉన్నారో చెప్పడానికి ఇష్టపడలేదు.

అన్నమయ్య జిల్లాలో ఎక్కువ మంది ప్రవాసాంధ్రులు ఉన్నారు.. ఆ జిల్లాలో 17,980 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరంతా గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లి ఉంటారని భావిస్తు్న్నారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరిలో 15,471 మంది, డా.బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 15,378 మంది ప్రవాసాంధ్రులు ఉన్నారు. వీరంతా పని కోసం వెళ్లినవారని అంచనా వేస్తున్నారు. ప్రవాసాంధ్రులకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు అలాంటివారు ఎంతమంది ఉన్నారో తేల్చాలన్న ప్రవాసాంధ్రుల తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్టీ) విజ్ఞప్తిపై సచివాలయాల శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ఇంటింటి సర్వే చేయించింది.

అన్నమయ్య జిల్లాలో 17,980, పశ్చిమగోదావరి జిల్లాలో 15,471, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 15,378, శ్రీకాకుళం జిల్లాలో 9,838, విశాఖపట్నం జిల్లాలో 8,892, ఎన్టీఆర్ జిల్లాలో 8,224, కడప జిల్లాలో 7,925, చిత్తూరు జిల్లాలో 7,635, గుంటూరు జిల్లాలో 7,547, ప్రకాశం జిల్లాలో 7,063, తిరుపతి జిల్లాలో 6,673, కృష్ణా జిల్లాలో 6,370, నెల్లూరు జిల్లాలో 5,926, బాపట్ల జిల్లాలో 5,248, కాకినాడ జిల్లాలో 4,869, ఏలూరు జిల్లాలో 4,578, అనంతపురం జిల్లాలో 4,571, కర్నూలు జిల్లాలో, 4,514, తూర్పుగోదావరి జిల్లాలో 4,236, పల్నాడు జిల్లాలో 4,054, శ్రీసత్యసాయి జిల్లాలో 3,693, నంద్యాల జిల్లాలో 3,668, అనకాపల్లి జిల్లాలో 2,670, విజయనగరం జిల్లాలో 1,919, పార్వతీపురం జిల్లాలో 995, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 572మంది ఉన్నారు. ఆసక్తికరంగా ఏపీ నుంచి విదేశాలకు వెళ్లిన వారిలో ఎక్కువమంది గల్ఫ్ దేశాలకు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గోదావరి జిల్లాలతో పాటుగా రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉండటంతో.. అక్కడి నుంచి ఎక్కువమంది గల్ఫ్ దేశాలకు వెళ్లినట్లు భావిస్తున్నారు.

ఏపీలో NRIలు ఎంతమంది ఉన్నారో తెలుసా.. లెక్క తేలింది, ఆశ్చర్యంగా ఆ రాయలసీమ జిల్లా టాప్‌లో

ఏపీలో మరో రెండు కొత్త యూనివర్శిటీలను ఏర్పాటు చేయబోతన్నారు.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు.. కర్ణాటక నుంచి ఆ ప్రాజెక్టును తరలిస్తారా అనే చర్చ జరుగుతోంది. ఏపీలో రేషన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..

21 March 2026

Woman Saree Promotion Tirumala,తిరుమలలో చీరల వ్యాపారం ప్రమోషన్స్.! భక్తుల విమర్శలు.. – criticism against female influencer for allegedly promoting saree business in tirumala

21 March 2026

Exams Postponed 2026: నేటి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, టెన్త్ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే!

21 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Adilabad: అయ్యో గణపతి అన్నంత పని చేశావ్ కదయ్యా.. కన్నీళ్లు ఆగవ్..

21 March 2026

చేతికొచ్చిన పంట అకాల వర్షంతో నీటి పాలైంది. పండించిన పంటకు గిట్టుబాటు రాక కొనే నాదుడు లేక అప్పులను మిగిల్చింది.…

తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు.. ఫ్యామిలీతో ఉస్తాద్ భగత్ సింగ్ చూసిన మెగాస్టార్..

21 March 2026

కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి.. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్స్!

21 March 2026

ఇరాన్‌‌కు బిగ్ షాక్.. నటాంజ్‌ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై మరోసారి అమెరికా – ఇజ్రాయెల్ వైమానిక దాడులు!

21 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Adilabad: అయ్యో గణపతి అన్నంత పని చేశావ్ కదయ్యా.. కన్నీళ్లు ఆగవ్..

21 March 2026

తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు.. ఫ్యామిలీతో ఉస్తాద్ భగత్ సింగ్ చూసిన మెగాస్టార్..

21 March 2026

కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి.. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్స్!

21 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025178

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025174
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.