హైదరాబాద్, జూన్ 23: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 (యూజీసీ- నెట్) జూన్ సెషన్ పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) తాజాగా విడుదల చేసింది. నెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కాగా జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో యూజీసీ నెట్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు ఆయా తేదీల్లో జరగనున్నాయి. కాగా యేటా జూనియర్ రిసెర్చి ఫెలోషిప్ అవార్డు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, పీహెచ్డీ ప్రవేశాలకు అర్హత సాధించేందుకు యూజీసీ నెట్ పరీక్షలను రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను మొత్తం 85 సబ్జెక్టుల్లో ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. జూన్25 నుంచి ప్రారంభంకానున్న నెట్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులో ఫోటో, సంతకం, క్యూఆర్ కోడ్ తప్పుగా ఉంటే.. వాటిఇని తిరిగి డౌన్లోడ్ చేసుకోవాలని ఎన్టీయే సూచించింది.
యూజీసీ-నెట్ 2025 జూన్ అడ్మిట్ కార్డులను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.
ఇవి కూడా చదవండి
తెలంగాణ ఐసెట్ ప్రాథమిక కీ విడుదల .. జూన్ 26 వరకు అభ్యంతరాలకు ఛాన్స్!
తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2025 (టీజీ ఐసెట్ 2025) పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది. ఆన్సర్ కీతోపాటు రెస్పాన్స్ షీట్, ప్రశ్న పత్రాలను ఉన్నత విద్యా మండలి అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. ఈమేరకు అభ్యర్థులు https://icet.tgche.ac.in/ అధికారిక వెబ్సైట్ నుంచి కీ ని డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రాథమిక కీ పై జూన్ 26వ తేదీ వరకు అభ్యంతరాలను లేవనెత్తేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. కాగా జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగిన విషయం తెలిసిందే.
టీజీ ఐసెట్ 2025 ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.