
ఆంధ్రప్రదేశ్ ఫౌల్ట్రీ ఫామ్ రైతులు వరద బాధితుల సహాయార్థం రూ.25లక్షలు విరాళం అందజేశారు.. చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. ఎల్‌వీఆర్ అండ్ సన్స్, రీడింగ్ రూం క్లబ్ వారు రూ.25లక్షల విరాళం ఇచ్చారు.. ముఖ్యమంత్రికి చెక్కు ఇచ్చారు. వరద బాధితుల సహాయార్థం గుంటూరుకు చెందిన పయనీర్ సంస్థ రూ.25లక్షల సాయాన్ని ప్రకటించింది.. వీరు కూడా చెక్కును చంద్రబాబుకు అందజేశారు. నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ, దాని అనుబంధ సంస్థ తరఫున రూ.25లక్షలను విరాళంగా చెక్కును అందజేశారు.
ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా స్వయం సహాయక సంఘాల సమాఖ్య సభ్యులు వరద బాధితుల కోసం రూ.10లక్షల చెక్కును చంద్రబాబుకు అందించారు. వరదలో బాధితుల్ని ఆదుకోవడానికి గుంటూరు క్లబ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ పాతూరి కిరణ్, కార్యదర్శి నల్లమోతు సాంబశివరావు రూ.10లక్షలు అందజేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని మిడ్‌వాలీ సిటీ నివాసితులు వరద బాధితులకు ఆహారం సమకూర్చడానికి రూ.10.77లక్షలు ఇచ్చారు. గుంటూరు లోటస్ ఇన్‌ఫ్రా ప్రతినిధులు మంత్రి లోకేష్‌కు రూ.పది లక్షల విరాళం అందజేశారు. ఏలూరుకు చెందిన ఎన్ఆర్ఐలు మేకా వినయ్‌బాబు, సామినేని పవన్‌కుమార్‌లు రూ.పది లక్షల విరాళం చెక్కును మంత్రికి ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లు ఫౌండేషన్ తరఫున రూ.10 లక్షలు విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందజేశారు. ఏపీ మంత్రి ఎస్.సవిత కుమారుడు జగదీశ్.. వరద బాధితుల కోసం తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.21వేలు విరాళంగా అందజేశారు.
కాకతీయ మ్యూచువల్లీ ఎయిడెడ్ సహకార సంస్థ- రూ.25లక్షలు, ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం- రూ.5లక్షలు, సిటీ కేబుల్ ఎండీ సాయి- రూ.5లక్షలు, అమరావతి జేఏసీ మహిళా అధ్యక్షురాలు రాయపాటి శైలజ రూ.5 లక్షలు.. ఏపీ అసెంబ్లీ అయ్యన్నపాత్రుడు నెల జీతం విరాళంగా ప్రకటించారు. అలాగే ఏపీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ కార్మిక పరిషత్ వరద బాధితుల్ని ఆదుకోవడానికి తమవంతుగా ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. వీరితో పాటుగా ఎంతోమంది వివిధ జిల్లాల నుంచి ఆహారం, కూరగాయలు, బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్.. ఇలా తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు.

