Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ రెండు విషయాలు తెలుసుకోకపోతే ట్రబుల్స్‌ గ్యారంటీ..

20 April 2026

Tamarind Lollipop: బయట దొరికే చాక్లెట్ల కంటే ఇవి ఎంతో మేలు.. పది నిమిషాల్లో ఈ లాలిపాప్‌లను తయారు చేసుకోండి

20 April 2026

పనికిరాని బల్బులను పారేస్తున్నారా? ఈ అద్భుతమైన ఐడియాలతో మీ ఇంటిని అలంకరించండిలా!

20 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! | CM MK Stalin Issues Final Warning to PM Modi Over Delimitation; Threatens Massive Protest in Tamilnadu
తాజా వార్తలు

కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! | CM MK Stalin Issues Final Warning to PM Modi Over Delimitation; Threatens Massive Protest in Tamilnadu

.By .14 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! | CM MK Stalin Issues Final Warning to PM Modi Over Delimitation; Threatens Massive Protest in Tamilnadu
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

India

oi-Jakki Mahesh

Time
Published: Tuesday, April 14, 2026, 15:51 [IST]

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీస్తూ.. ఉత్తరాది రాష్ట్రాలకు రాజకీయ అధికారం పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటే, తమిళనాడు మొత్తం స్తంభించిపోయేలా భారీ నిరసనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో, పునర్విభజన వల్ల దక్షిణాదికి జరిగే అన్యాయాన్ని ఎదిరించడానికి ప్రతి కుటుంబం రోడ్లపైకి వస్తుందని, తన నాయకత్వంలోనే ఈ పోరాటం జరుగుతుందని స్టాలిన్ స్పష్టం చేశారు.

ఎన్నికల సమయంలో రహస్య వ్యూహమా?:
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఏప్రిల్ 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడాన్ని స్టాలిన్ తప్పుబట్టారు. ఎన్నికల హడావుడిలో ఉన్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజన కోసం సవరణలను బలవంతంగా ఆమోదించుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియను రహస్యంగా నిర్వహించడం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయని.. కేంద్రం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పష్టమైన వివరణ ఇవ్వలేదని ఆయన విమర్శించారు.

CM MK Stalin Issues Final Warning to PM Modi Over Delimitation Threatens Massive Protest in Tamilnadu

డీఎంకే పూర్వ వైభవం చూస్తారు:
తాను కేవలం ముఖ్యమంత్రిని మాత్రమే కాదని, ఓ శక్తివంతమైన రాజకీయ ఉద్యమమైన డీఎంకే నేతను అని స్టాలిన్ గుర్తు చేశారు. 1950, 60వ దశకాల్లో డీఎంకే సాగించిన చారిత్రాత్మక పోరాటాలను దేశం మరోసారి చూస్తుందని ఆయన హెచ్చరించారు. పదవులు, ఎన్నికల కంటే తమకు ఆత్మగౌరవం, సిద్ధాంతాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అన్నాదురై, కరుణానిధిల నుంచి వారసత్వంగా వచ్చిన సిద్ధాంతాల ప్రకారం రాష్ట్రాల హక్కుల కోసం చివరి వరకు పోరాడుతామని ఆయన ఉద్ఘాటించారు.

Hon’ble Prime Minister, this is Tamil Nadu’s final warning.

மாண்புமிகு பிரதமர் அவர்களே, இது தமிழ்நாட்டின் இறுதி எச்சரிக்கை!#TNwillFightTNwillWin pic.twitter.com/v9wkYYM6MO

— M.K.Stalin – தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) April 14, 2026

కుటుంబ నియంత్రణ పాటిస్తే శిక్షిస్తారా?:
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సలహా మేరకు దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశాయని.. దానికి ప్రతిఫలంగా ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించి మమ్మల్ని శిక్షిస్తారా? అని స్టాలిన్ ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ నుంచి స్పష్టమైన హామీ కోరినా సమాధానం రాలేదని, ఎంపీలకు ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తమిళనాడు నుండి కేంద్రానికి ఇస్తున్న చివరి హెచ్చరిక అని, రాష్ట్ర హక్కుల కోసం దేశం దృష్టిని ఆకర్షిస్తామని ఆయన ముగించారు.

English summary

Tamilnadu CM MK Stalin warns the Centre of a state-wide standstill if delimitation hurts Southern states. He slammed the secret session on April 16 amidst state elections.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ రెండు విషయాలు తెలుసుకోకపోతే ట్రబుల్స్‌ గ్యారంటీ..

20 April 2026

Tamarind Lollipop: బయట దొరికే చాక్లెట్ల కంటే ఇవి ఎంతో మేలు.. పది నిమిషాల్లో ఈ లాలిపాప్‌లను తయారు చేసుకోండి

20 April 2026

పనికిరాని బల్బులను పారేస్తున్నారా? ఈ అద్భుతమైన ఐడియాలతో మీ ఇంటిని అలంకరించండిలా!

20 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ రెండు విషయాలు తెలుసుకోకపోతే ట్రబుల్స్‌ గ్యారంటీ..

20 April 2026

ఆర్ధిక అవసరాల కోసం, అత్యవసర పరిస్థితుల్లో నగదు కోసం చాలామంది తమ బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు.…

Tamarind Lollipop: బయట దొరికే చాక్లెట్ల కంటే ఇవి ఎంతో మేలు.. పది నిమిషాల్లో ఈ లాలిపాప్‌లను తయారు చేసుకోండి

20 April 2026

పనికిరాని బల్బులను పారేస్తున్నారా? ఈ అద్భుతమైన ఐడియాలతో మీ ఇంటిని అలంకరించండిలా!

20 April 2026

Folk Dancer : ఆ ఒక్క పాట నా లైఫ్ మార్చేసింది.. దెబ్బకు 60కి పైగా సాంగ్స్ చేశాను.. ఫోక్ డ్యాన్సర్ కామెంట్స్..

20 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ రెండు విషయాలు తెలుసుకోకపోతే ట్రబుల్స్‌ గ్యారంటీ..

20 April 2026

Tamarind Lollipop: బయట దొరికే చాక్లెట్ల కంటే ఇవి ఎంతో మేలు.. పది నిమిషాల్లో ఈ లాలిపాప్‌లను తయారు చేసుకోండి

20 April 2026

పనికిరాని బల్బులను పారేస్తున్నారా? ఈ అద్భుతమైన ఐడియాలతో మీ ఇంటిని అలంకరించండిలా!

20 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.