Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Telangana: విమానం కంటే వేగం.! ఇక హైదరాబాద్ టూ తిరుపతి.. జస్ట్ 30 నిమిషాలే..

8 May 2026

ట్రోపోస్ఫియర్ లో తీవ్ర గాలులు: ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు | Winds in the Troposphere Trigger Light Rain and Thunderstorms Across Several Districts for Two Days

8 May 2026

Jayaprada : ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం.. అతడి మనసు బంగారం.. హీరోయిన్ జయప్రద..

8 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Rains,ఏపీలో కొనసాగుతున్న వర్షాలు.. ఈ జిల్లాల్లో మరో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు – apsdma on andhra pradesh weather report that rains for another two days
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Rains,ఏపీలో కొనసాగుతున్న వర్షాలు.. ఈ జిల్లాల్లో మరో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు – apsdma on andhra pradesh weather report that rains for another two days

.By .8 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Rains,ఏపీలో కొనసాగుతున్న వర్షాలు.. ఈ జిల్లాల్లో మరో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు – apsdma on andhra pradesh weather report that rains for another two days
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Rains And High Temperatures: ఏపీలో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలు జిల్లాల్లో ఎండ ప్రభావం కొనసాగుతోంది. రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే పిడుగుల పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

హైలైట్:

  • ఏపీలో కొననసాగుతున్న వర్షాలు
  • మరో రెండు రోజుల పాటూ వానలు
  • ప్రజల్ని అలర్ట్ చేసిన APSDMA
AP Rains
ఏపీలో వర్షాలు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో విభిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. ఓవైపు వర్షాలు.. మరోవైపు ఎండలు, ఉక్కపోత, వేడిగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ట్రోపో ఆవరణంలో గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, చిత్తూరు, తిరుపతి, కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు ప్రజలు, రైతులు, రైతు కూలీలు, పశువుల కాపర్లు చెట్ల కింద, పొలాల్లో ఉండొద్దని.. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా జికే వీధి మండలంలో తీవ్ర వేడగాలులు.. అలాగే ముంచింగిపుట్టు, పెదబయలు, గోకవరం, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వేడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గురువారం రోజు అత్యధికంగా పోలవరం జిల్లా వీఆర్ పురంలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంపరైలో 21.5మిమీ వర్షపాతం నమోదైంది. గత నాలుగైదు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఎండలు, ఉక్కపోత, వేడిగాలుల ప్రభావం కనిపిస్తోంది.

గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాలను ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తాయి. ఈ గాలుల దెబ్బకు చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది.

కృష్ణా జిల్లా కోడూరు మండలంలో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురుసింది. తెల్లవారంగానే ఆకాశంలో మబ్బులు కమ్మేసి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.ఈ వర్షాల కారణంగా గత వారం రోజులగా ఎండలు, వేడిగాలులు, ఉక్కపొతతో అల్లాడుతున్న ప్రజలకు ఊరట దక్కింది. వాతావరణం చల్లబడడటంతో కాస్త ఉపశమనం దొరికింది. ఈ అకాల వర్షాలతో రైతులు పంటనష్టపోయారు. భారీ వర్షానికి రోడ్డుపై, కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం నీటమునిగింది. పలు పంటలు నేలవాలాయి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.

తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి