Mla Bode Prasad Warned Rtc Bus Driver: కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై సీరియస్ అయ్యారు. పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మండిపడ్డారు. కంకిపాడు కూడలిలో బస్సు ఆపకపోవడాన్ని బోడె ప్రసాద్ చూశారు. వెంటనే బస్సును ఆపి డ్రైవర్, కండక్టర్‌పై ఆగ్రహ వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్ని ప్రయాణికులు ఉన్నచోట బస్సు ఆపాలన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావొద్దన్నారు.
హైలైట్:
ఆర్టీసీ డ్రైవర్‌కు టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్
ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావొద్దు
బస్సు ఆపకపోవడంపై తీవ్ర ఆగ్రహం
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు బోడె ప్రసాద్ వార్నింగ్(ఫోటోలు– Samayam Telugu)
ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తే ఊరుకునేది లేదన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు సినిమా హాల్ సెంటర్‌లో బస్టాప్ ఉంది.. అక్కడ ప్రయాణికులంతా బస్సు కోసం వేచి ఉన్నారు. ఇంతలో ఓ ఆర్టీసీ బస్సు అక్కడికి వచ్చింది. బస్టాప్‌లో ప్రయాణికులు ఉన్నా సరే డ్రైవర్ బస్సును ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బస్సు వెనకే వస్తున్న ఎమ్మెల్యే బోడెప్రసాద్ గమనించారు. వెంటనే ఎమ్మెల్యే తన కారుతో ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేసి బస్సును ఆపి అందులో ఎక్కారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ తీరుపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్సులు ఆపకుండా వెళ్లి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దని హెచ్చరించారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌లు ప్రయాణికులు ఎక్కడ ఉంటే అక్కడ ఆపాలని సూచించారు. ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే సహించేది లేదని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశ పెట్టిందని.. అప్పటి నుంచి ఆర్టీసీ సిబ్బంది తీరు బాగాలేదన్నారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గోసాల సెంటర్ నుంచి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించారు.. ప్రయాణికులతో మాట్లాడారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు ఉచిత బస్సు పథకాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
ఉచిత బస్సు పథకమని చెప్పి బస్సులు ఆపకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు బోడె ప్రసాద్. బస్సు ఖాళీగా ఉన్నా ఎందుకు ఆపలేదని, ఒకవేళ సీట్లు లేకపోతే నిలబడతారు కదా అన్నారు.. ప్రయాణికులు ప్రభుత్వాన్ని తిట్టుకుంటారన్నారు. ఈ ఒక్కచోట మాత్రమే కాదు అన్నిచోట్లా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్ కవర్ చేసేందుకు ప్రయత్నం చేయగా.. బస్సు ఆపలేదని, తాను స్వయంగా చూశానన్నారు. ఆర్టీసీ సిబ్బంది తీరు వల్ల ఫ్రీ బస్సు పథకం పెట్టి ఉపయోగం ఏముందని.. మరోసారి ఈ తప్పు జరగకుండా చూసుకోవాలన్నారు. బోడె ప్రసాద్ ఆర్టీసీ బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.
తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి