Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! | CM MK Stalin Issues Final Warning to PM Modi Over Delimitation; Threatens Massive Protest in Tamilnadu

14 April 2026

రీల్ హీరో.. రియల్ పాలిటిక్స్.. ఎన్నికల వేళ రాజకీయ దుమారం రేపుతోన్న ‘TN 2026’..!

14 April 2026

జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ – కీలక విజ్ఞప్తి..!! | CM Chandra Babu Letter to YS jagan & all parties leaders asked to support Nari shakti Vandan bill in parliament

14 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»భద్రతా దళాలు భారీ ఆపరేషన్.. 21 బంకర్లు ధ్వంసం, 13 ఐఈడీలు స్వాధీనం..!
జాతీయం

భద్రతా దళాలు భారీ ఆపరేషన్.. 21 బంకర్లు ధ్వంసం, 13 ఐఈడీలు స్వాధీనం..!

.By .12 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
భద్రతా దళాలు భారీ ఆపరేషన్.. 21 బంకర్లు ధ్వంసం, 13 ఐఈడీలు స్వాధీనం..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

భద్రతా దళాలు భారీ ఆపరేషన్.. 21 బంకర్లు ధ్వంసం, 13 ఐఈడీలు స్వాధీనం..!

మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా దళాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. శనివారం (ఏప్రిల్ 11, 2026) నాడు రాష్ట్రంలోని ఉఖ్రుల్, టెంగ్నౌపాల్ జిల్లాల్లో జరిపిన దాడుల్లో తిరుగుబాటుదారుల స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు. ఉఖ్రుల్ జిల్లాలోని సికిబుంగ్, మోంగ్‌కోట్ చెపు గ్రామాల్లో సాయుధ తిరుగుబాటుదారులు అక్రమంగా నిర్మించిన 21 బంకర్లను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. లిటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ తనిఖీల్లో సికిబుంగ్‌లో 14, మోంగ్‌కోట్ చెపులో 7 బంకర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ బంకర్లన్నీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే లక్ష్యంతో నిర్మించినవేనని అధికారులు వెల్లడించారు.

మరోవైపు, టెంగ్నౌపాల్ జిల్లాలోని మోరే ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లో భారీగా మందుగుండు సామగ్రి బయటపడింది. భద్రతా దళాలు అక్కడ 13 ఐఈడీలను (IEDs)స్వాధీనం చేసుకుని, వాటిని అక్కడికక్కడే నిర్వీర్యం చేశాయి. వీటితో పాటు ఒక 9ఎంఎం పిస్టల్ మ్యాగజైన్ ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల మోంగ్‌కోట్ చేపు గ్రామం సమీపంలో గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. గ్రామం సమీపంలో విధి నిర్వహణలో ఉన్న ఆ సైనికుడిపై గుర్తు తెలియని దిశ నుండి వచ్చిన తూటా దూసుకురావడంతో ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో ఈ గాలింపు చర్యలు తీవ్రతరమయ్యాయి.

ఇదిలావుంటే, మణిపూర్ రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. ఏప్రిల్ 7న బిష్ణుపూర్ జిల్లా ట్రోంగ్లావోబిలో అనుమానిత ఉగ్రవాదులు ఒక ఇంటిపై బాంబు దాడి చేయడంతో ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల పసికందు మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహించిన సుమారు 500 మంది నిరసనకారులు సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి చేసి వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోగా, 30 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేసులో యునైటెడ్ కుకీ నేషనల్ ఆర్మీకి చెందిన ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంబు దాడిలో వీరి ప్రమేయంపై లోతైన విచారణ జరుగుతోంది. శాంతిని పునరుద్ధరించేందుకు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు నిరంతరం నిఘా పెంచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

RRB NTPC UG 2026 Exam Dates: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్‌ రాత పరీక్ష తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్ ఇదే

14 April 2026

Viral Video: 50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌.. బాబోయ్‌ అంటూ..

14 April 2026

Video: ఇది అద్భుతం కాక ఇంకేంటీ.. దేవుడి సాక్షిగా గుండెల్ని హత్తుకునే ఘటన.. వీడియో వైరల్..

14 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! | CM MK Stalin Issues Final Warning to PM Modi Over Delimitation; Threatens Massive Protest in Tamilnadu

14 April 2026

India oi-Jakki Mahesh Published: Tuesday, April 14, 2026, 15:51 [IST] నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తమిళనాడు…

రీల్ హీరో.. రియల్ పాలిటిక్స్.. ఎన్నికల వేళ రాజకీయ దుమారం రేపుతోన్న ‘TN 2026’..!

14 April 2026

జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ – కీలక విజ్ఞప్తి..!! | CM Chandra Babu Letter to YS jagan & all parties leaders asked to support Nari shakti Vandan bill in parliament

14 April 2026

రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలంలో తినాల్సిన పండ్లు ఇవే..

14 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! | CM MK Stalin Issues Final Warning to PM Modi Over Delimitation; Threatens Massive Protest in Tamilnadu

14 April 2026

రీల్ హీరో.. రియల్ పాలిటిక్స్.. ఎన్నికల వేళ రాజకీయ దుమారం రేపుతోన్న ‘TN 2026’..!

14 April 2026

జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ – కీలక విజ్ఞప్తి..!! | CM Chandra Babu Letter to YS jagan & all parties leaders asked to support Nari shakti Vandan bill in parliament

14 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025449

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.