Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పచ్చి కొబ్బరి అటుకుల ఉండలు.. ఇలా చేసి తింటే రుచికి ఇంటిల్లిపాది ఫిదా

16 April 2026

Microfinance controversy: ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ముదురుతున్న కేసు.. మంగ్లీ కౌంటర్ కంప్లైంట్

16 April 2026

FASTag: ఫాస్టాగ్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ ఫాస్టాగ్ బ్లాక్.. కొత్త రూల్ ఏంటంటే..?

16 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»రాశిఫలాలు (ఏప్రిల్ 16, 2026): వారికి ఉద్యోగ జీవితంలో అంతా హ్యాపీ..! మీ రాశికి ఇలా..
తాజా వార్తలు

రాశిఫలాలు (ఏప్రిల్ 16, 2026): వారికి ఉద్యోగ జీవితంలో అంతా హ్యాపీ..! మీ రాశికి ఇలా..

.By .16 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
రాశిఫలాలు (ఏప్రిల్ 16, 2026): వారికి ఉద్యోగ జీవితంలో అంతా హ్యాపీ..! మీ రాశికి ఇలా..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


దిన ఫలాలు (ఏప్రిల్ 16, 2026): మేష రాశికి చెందిన ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. మిథున రాశి వారికి వ్యక్తిగత జీవితంలో చిన్నాచితకా సమస్యలు చాలావరకు తగ్గుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేసి ప్రయోజనాలు పొందుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ముఖ్యంగా ఆదాయ వృద్ధి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఆస్తి సంబంధమైన వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ, వాహన ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. మిత్రులతో కలిసి సేవా కార్య క్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు కానీ, కొందరు బంధుమిత్రుల కారణంగా బాగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ జీవితం అన్ని విధాలా సామరస్యంగా, సంతృప్తికరంగా సాగుతుంది. కొన్ని వివాదాల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. పిల్లల నుంచి అనుకోని శుభవార్తలు అందుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది కానీ, కొందరు సహచరులు వల్ల ఇబ్బందులున్నాయి. వ్యక్తిగత జీవితంలో చిన్నాచితకా సమస్యలు చాలావరకు తగ్గుతాయి. ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆదాయానికి లోటుండదు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో మాట తొందరపాటు ప్రదర్శించకపోవడం మంచిది. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులతో సామరస్యం పెరుగుతుంది. సామాజికంగా కూడా అను కూలలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని చిన్నా చితకా సమస్యలున్నప్పటికీ, కార్యకలాపాలు బాగా పురోగమిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆర్థిక పురోగతి కూడా ఉంటుంది. పిల్లలు చదువుల్లో అభివృద్ధి సాధిస్తారు. తలపెట్టిన వ్యక్తిగత పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ జీవితం చాలావరకు సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యత కనిపిస్తుంది. కొందరు స్నేహితులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి కెరీర్ కి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో పోటీ బాగా ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో బాధ్యతల మార్పులకు కూడా అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదాలు రానివ్వకపోవడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పిల్లలకు చాలా బాగుంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. మిగిలిన విషయాల్లో కూడా రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. విలాసాల మీద ఖర్చయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితంలో ప్రత్యేక బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో బాగా ఒత్తిడి ఉండ వచ్చు. ఆశించిన ప్రతిఫలం కూడా అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. తోబుట్టువుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉత్సాహాన్నిచ్చే కబురు అందుతుంది. ఆరోగ్య పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితం బిజీగా మారుతుంది. కొత్త వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. దైవకార్యాల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. తలపెట్టిన కార్యక్రమాలు, వ్యవహారాలలో కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన అవకాశాలు అందుతాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను కార్యరూపంలో పెట్టి లాభాలు గడిస్తారు. ఇంటా బయటా కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కూడా మంచి కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందవచ్చు. ఆరోగ్యం మీద బాగాశ్రద్ధ పెట్టాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో నూతనోత్సాహంతో పురోగమిస్తారు. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపా రాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా కొనసాగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులు, తోబుట్టువులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థిక పరిస్థితి బాగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. శ్రమాధిక్యత ఉన్నా వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు సక్రమంగా, సకాలంలో నిర్వర్తిస్తారు. వ్యాపారంలో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు, రాబడి ప్రయత్నాలకు అవకాశాలు బాగానే ఉంటాయి. మిత్రుల వల్ల పక్కదోవ పట్టే సూచనలున్నాయి. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

పచ్చి కొబ్బరి అటుకుల ఉండలు.. ఇలా చేసి తింటే రుచికి ఇంటిల్లిపాది ఫిదా

16 April 2026

FASTag: ఫాస్టాగ్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ ఫాస్టాగ్ బ్లాక్.. కొత్త రూల్ ఏంటంటే..?

16 April 2026

బ్యాంకింగ్‌ సంక్షోభం.. RBI కీలక నిర్ణయం! ఏం మారనుందంటే..?

16 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

పచ్చి కొబ్బరి అటుకుల ఉండలు.. ఇలా చేసి తింటే రుచికి ఇంటిల్లిపాది ఫిదా

16 April 2026

కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు అటుకులు, ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అర కప్పు బెల్లం తురుము, రెండు…

Microfinance controversy: ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ముదురుతున్న కేసు.. మంగ్లీ కౌంటర్ కంప్లైంట్

16 April 2026

FASTag: ఫాస్టాగ్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ ఫాస్టాగ్ బ్లాక్.. కొత్త రూల్ ఏంటంటే..?

16 April 2026

బ్యాంకింగ్‌ సంక్షోభం.. RBI కీలక నిర్ణయం! ఏం మారనుందంటే..?

16 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

పచ్చి కొబ్బరి అటుకుల ఉండలు.. ఇలా చేసి తింటే రుచికి ఇంటిల్లిపాది ఫిదా

16 April 2026

Microfinance controversy: ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ముదురుతున్న కేసు.. మంగ్లీ కౌంటర్ కంప్లైంట్

16 April 2026

FASTag: ఫాస్టాగ్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ ఫాస్టాగ్ బ్లాక్.. కొత్త రూల్ ఏంటంటే..?

16 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025451

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.