Andhra Pradesh High Temperatures Heat Waves Today,ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు.. ఈ జిల్లాల ప్రజలకు APSDMA హెచ్చరిక, జాగ్రత్తగా ఉండాలి – apsdma warns people on high temperatures and heat waves in andhra pradesh on april 17 2026
Andhra Pradesh High Temperatures Heat Waves Alert: ఏపీలో ఎండ తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వడగాలులు ప్రభావం చూపుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇవాళ కూడా ఎండలు, వేడి గాలుల తీవ్రత కొనసాగుతుందని తెలిపింది. గురువారం నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 215 మండలాల్లో 40°C పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.
హైలైట్:
ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతోంది
ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
ఏపీలో మండిపోతున్న ఎండలు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌ల సూర్యుడి భగభగలు కొనసాగుతున్నాయి.. రాష్ట్రంలో ఎండల తీవ్రత బాగా పెరిగింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగిందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, అల్లూరి సీతారామరారజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, పోలవరం జిల్లాల్లోని సుమారు 30 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 55 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠంగా 43 డిగ్రీల నుంచి 44.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా సంజామలలో 45.1 డిగ్రీలు, ఆ తర్వాత కడప జిల్లా ఒంటిమిట్టలో ఏకంగా 44.9 డిగ్రీలు, మార్కాపురం జిల్లా అనుమలపల్లిలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం 215 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.ఓ వైపు ఎండ, మరోవైపు వేడిగాలులు, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు మధ్యాహ్నం 12గంటల తర్వాత నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకపోవడం మంచిదంటున్నారు. ప్రజలు వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగడంతో పాటుగా నిమ్మ రసం, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు. ఎవరైనా అత్యవసరమై బయటకు వెళ్లాలనుకుంటే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరోవైపు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు మరణాల నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్రంలో పిడుగుపాటు మరణాలను తగ్గించే లక్ష్యంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ, NRSC మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఎంవోయూ మీద ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, NRSC డిప్యూటీ డైరెక్టర్ డా అపర్ణ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో పిడుగులు పడే హాట్‌స్పాట్‌ల గుర్తించడం.. ముందస్తు హెచ్చరికల వ్యవస్థ బలోపేతం చేయొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టాల నివారించొచ్చు అంటున్నారు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.
తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి