
బంగారం రేట్లలో పెరుగుదల నమోదవుతోంది. సోమవారం నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో గోల్డ్ రేట్లు హైక్ అవుతున్నాయి. దీంతో కొనుగోలుదారులకు షాక్ తగులుతోంది. గత వారంలో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గడంతో కొనుగోలు చేసేవారు ఊరట చెందారు. కానీ ఈ వారంలో ధరలు పెరుగుతుండటంతో షాపులకు వెళ్లేందుకు కూడా వెనకడుగు వేస్తున్నారు. శుక్రవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
నేటి బంగారం ధరలు
-హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ రేటు రూ.1,55,580 వద్ద కొనసాగుతోండగా.. గురువారం రూ.1,55,570 వద్ద స్ధిరపడింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,610 వద్ద ఉండగా.. నిన్న రూ.1,42,600గా ఉంది.
-ఇక విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,580 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,610 వద్ద ట్రేడవుతోంది.
-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,56,670 వద్ద ఉండగా.. నిన్న రూ.1,56,660 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,43,610 వద్ద ట్రేడవుతోండగా.. నిన్న రూ.1,43,600 వద్ద స్ధిరపడింది.
-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,580 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,610 వద్ద ఉంది.
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,730 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.1,55,720గా ఉంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,760 వద్ద ఉండగా.. నిన్న రూ.1,42,750గా ఉంది.
వెండి ధరలు ఇలా..
-ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2,69,900 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది
-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,74,900గా ఉంది.
-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,74,900 వద్ద కొనసాగుతోంది.
-బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2,69,900గా ఉంది. నిన్న ఈ ధర రూ.2.70 లక్షలుగా ఉంది.
