Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

జీలకర్ర Vs సోంపు నీళ్లు.. షుగర్ పేషెంట్లకు ఏది బెస్ట్..? తప్పక తెలుసుకోండి..

29 April 2026

IPL 2026 : చిక్కుల్లో రాజస్థాన్ కెప్టెన్.. డ్రస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ కాలుస్తూ దొరికిపోయిన స్టార్ ప్లేయర్

29 April 2026

నిద్రపోవడానికి మీ చిన్నారి చుక్కలు చూపిస్తోందా? 7 టిప్స్‌తో చిటికెలో నిద్రలోకి

29 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»ఉస్మానియా పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు
తెలంగాణ

ఉస్మానియా పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు

.By .17 April 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఉస్మానియా పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి పీజీ విద్యార్థి కాట్రావత్ సురేష్ కుమార్ (26) ఆత్మహత్య కేసు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన సురేష్‌కు పీజీ నీట్ ద్వారా ఉస్మానియాలో సర్జరీ విభాగంలో సీటు వచ్చింది. అయితే అతడు జనరల్ మెడిసిన్‌లో సీటు వస్తుందని ఆశపడ్డాడని, సర్జరీ కోర్సుపై ఆసక్తి లేకపోవడంతో నిరాశకు గురైనట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. కోర్సు మార్చుకోవడానికి చివరి వరకు ప్రయత్నించినా, మూడు రౌండ్ల కౌన్సెలింగ్‌లోనూ సాధ్యం కాలేదు. నిబంధనల ప్రకారం కోర్సు మధ్యలో వదిలివేయాలంటే భారీ మొత్తం చెల్లించాల్సి ఉండటంతో సురేష్ మరింత ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లోనే అతడు డిప్రెషన్‌కు గురయ్యి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ఇక ఘటన జరిగిన రోజున, సురేష్ అధిక మోతాదులో ఇంజెక్షన్లు, మాత్రలు తీసుకుని హాస్టల్ గదిలో అచేతనంగా పడిపోయాడు. ఉదయం కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్నేహితులు వెళ్లి చూడగా అతడు అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సురేష్ కుటుంబ సభ్యులు, సహ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. సీనియర్లు అధిక పని ఒత్తిడి, సుదీర్ఘ డ్యూటీలతో వేధించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ర్యాగింగ్ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు సురేష్ సెల్‌ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. కాల్ రికార్డులు, మెసేజులు, సోషల్ మీడియా వివరాలు పరిశీలిస్తున్నారు. అలాగే సీసీ ఫుటేజ్ సేకరించి, తోటి విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. అఫ్జల్‌గంజ్ పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మృతి కింద నమోదు చేసి, ఒత్తిడి, కోర్సు అసంతృప్తి, ర్యాగింగ్ వంటి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలను కూడా సీరియస్‌గా తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

Also Read: సావిత్రి చివరి రోజుల్లో కోమాలో అచేతనంగా ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క తెలుగు నటి ఎవరంటే.. 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

TG SSC 10th Class Results 2026: మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్ చేసుకోండి

29 April 2026

అయ్యో.. ఎంత ఘోరం.. ట్యాంకర్ చక్రాల కింద పడి నలిగిన యువకుడు.. వీడియో చూస్తే..

28 April 2026

Sajjanar: మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్‌.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్ స్పెషల్‌ రిక్వెస్ట్‌

28 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

జీలకర్ర Vs సోంపు నీళ్లు.. షుగర్ పేషెంట్లకు ఏది బెస్ట్..? తప్పక తెలుసుకోండి..

29 April 2026

జీలకర్ర కేవలం రుచి కోసమే కాదు, అది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. జీలకర్రలోని థైమోక్వినోన్, క్యూమినాల్డిహైడ్…

IPL 2026 : చిక్కుల్లో రాజస్థాన్ కెప్టెన్.. డ్రస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ కాలుస్తూ దొరికిపోయిన స్టార్ ప్లేయర్

29 April 2026

నిద్రపోవడానికి మీ చిన్నారి చుక్కలు చూపిస్తోందా? 7 టిప్స్‌తో చిటికెలో నిద్రలోకి

29 April 2026

Weather Update: ఓవైపు ఎండలు, మరో వైపు వర్షాలు.. ఏ జిల్లాలో వాతవరణం ఎలా ఉండబోతుందంటే?

29 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

జీలకర్ర Vs సోంపు నీళ్లు.. షుగర్ పేషెంట్లకు ఏది బెస్ట్..? తప్పక తెలుసుకోండి..

29 April 2026

IPL 2026 : చిక్కుల్లో రాజస్థాన్ కెప్టెన్.. డ్రస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ కాలుస్తూ దొరికిపోయిన స్టార్ ప్లేయర్

29 April 2026

నిద్రపోవడానికి మీ చిన్నారి చుక్కలు చూపిస్తోందా? 7 టిప్స్‌తో చిటికెలో నిద్రలోకి

29 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.