
అమరావతి, మే 7: తమ ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన రోజే తొలి సంతకం మెగా DSC రిక్రూట్మెంట్‌పై చేసి.. మొత్తం 15,941 టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించింది. ఆ తర్వాత 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకాలను కూటమి సర్కార్ పూర్తి చేసింది. స్టైఫండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచింది. ఈ ఏడాది 10 వేలకు పైగా పోస్టులతో కొత్తగా జాబ్ కేలండర్‌ను సైతం విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు 23 నెలల్లో రూ.21 వేల కోట్ల బకాయిలు చెల్లించింది. మహిళా ఉద్యోగులకు ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా మెటర్నిటీ లీవ్ మంజూరు చూస్తుంది. మరోవైపు పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ రంగాల్లో కూటమి ప్రభుత్వం పురోగతి సాధించింది.
28 నూతన పాలసీలు, పరిశ్రమలకు రాయితీల కోసం దేశంలో తొలిసారి ఎస్క్రో ఖాతాలు తీసుకువచ్చింది. ఒక్క ఏడాదికి దేశంలోని పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకి వచ్చాయి. దీంతో బిజినెస్ రిఫార్మర్ అవార్డు కూడా రాష్ట్రానికి దక్కింది. CII సమ్మిట్ 538 ఒప్పందాలు, రూ.11.38 లక్షల కోట్ల పెట్టుబడులు, 13.95 లక్షల ఉద్యోగాలకు కీలక ముందడుగు వేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. 17 SIPB సమావేశాల్లో రూ.11,37,222 పెట్టుబడులు, 10,01,147 లక్షల ఉద్యోగాలను రాష్ట్రానికి తీసుకువచ్చామని, 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా విశాఖని IT హబ్ గా మారుస్తున్నట్లు పేర్కొన్నారు.
23 నెలల్లో గాడిలో పడిన పంచాయతీ రాజ్ వ్యవస్థ..
పల్లె పండుగ కింద గ్రామాల్లో 4,000 కి.మీ. రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అడవితల్లి బాటలో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, 4జీ నెట్‌వర్క్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చామన్నారు. 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదల, 90కి పైగా CSS పథకాల పునరుద్ధరణ, ఇంకా తిరుమల సహా దేవాలయాల్లో సంస్కరణలు, 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

