Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold Buying: ఇకపై రూ.1000కే బంగారం కొనవచ్చు.. గోల్డ్‌ కొనేందుకు కొత్త మార్గం..!

8 May 2026

Secunderabad -Anakapalle: సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-షెడ్యూల్, హాల్ట్ లు ఇవే..! | Secunderabad to Anakapalle New Weekly Train: Schedule, Stops & Departure Days Explained

8 May 2026

Tollywood : చదివింది 5వ తరగతి.. ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్.. కుర్రాళ్ల కలల దేవత..

8 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Farmers Chukkala Bhumulu Relief,రైతులకు ఆ భూములపై హక్కులు.. ఏపీ మంత్రి కీలక ప్రకటన – ap cm chandrababu will soon take a positive decision regarding granting rights to farmers on chukkala bhumulu says revenue minister satya prasad
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Farmers Chukkala Bhumulu Relief,రైతులకు ఆ భూములపై హక్కులు.. ఏపీ మంత్రి కీలక ప్రకటన – ap cm chandrababu will soon take a positive decision regarding granting rights to farmers on chukkala bhumulu says revenue minister satya prasad

.By .8 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Farmers Chukkala Bhumulu Relief,రైతులకు ఆ భూములపై హక్కులు.. ఏపీ మంత్రి కీలక ప్రకటన – ap cm chandrababu will soon take a positive decision regarding granting rights to farmers on chukkala bhumulu says revenue minister satya prasad
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Govt Decision On Chukkala Bhumulu Soon: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే చుక్కల భూములపై ఓ సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. భూములపై రైతులకు హక్కులు కల్పించే సీఎం చంద్రబాబు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అలాగే రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌శాఖల్ని ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకొస్తామంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలు రకాల భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

హైలైట్:

  • ఏపీల ోచుక్కల భూములపై కీలక ప్రకటన
  • త్వరలోనే రైతులకు భూములపై హక్కులు
  • రెవెన్యూశాఖ మంత్రి సత్యప్రసాద్ ప్రకటన
Ap Chukkala Bhumulu
చుక్కల భూములపై త్వరలో నిర్ణయం,(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భూములకు సంబంధించిన సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు విముక్తి కల్పిస్తోంది. ఇప్పటికే పలు రకాల భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలిగించిన సంగతి తెలిసిందే. తాజాగా చుక్కల భూములకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే చుక్కల భూములపై రైతులకు హక్కులు కల్పించే విషయమై సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. అమరావతిలో కలెక్టర్ల సదస్సులో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల ఏర్పాటు చేస్తామని.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌శాఖలను ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చి అనుసంధానిస్తామన్నారు. ఇప్పటికే రైతులే తమ భూపత్రాల్ని ఆన్‌లైన్‌లో లాక్‌ చేసుకునే విధానాన్ని ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు. అలాగే రైతులకు ఈకేవైసీ ద్వారా పట్టాదారు పాస్‌ పుస్తకాలిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇళ్ల పట్టాలిచ్చిన తర్వాత రెండేళ్లకే ప్రజలకు ఆ ఆస్తిపై హక్కులు కల్పిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నామన్నారు. నిషేధిత జాబితాలోని స్థలాల క్రమబద్ధీకరణ గడువును పట్టణ గరిష్ఠ భూపరిమితి చట్టం కింద డిసెంబరు 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. విలేజి సర్వీస్‌ ఇనాం భూములు 1.36 లక్షలు, షరతుగల పట్టా భూములు 33,440 ఎకరాలను 22ఎ నిషేధిత జాబితా నుంచి తొలగించాము అన్నారు.

రాష్ట్రానికి పరిశ్రమలు, కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే భూములు చాలా ముఖ్యమన్నారు చంద్రబాబు. ఒకవేళ భూములకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు వస్తే వెంటనే పరిష్కరించే వ్యవస్థ కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి నెలలో ఎంత భూమి అమసరమో గుర్తించి ప్రతిపాదనలు పంపాలన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ఈ ప్రక్రియను పూర్తిచేసి ఆన్‌లైన్‌లో వివరాలు ఉంచాలన్నారు. ఒకవేళ జిల్లాలో ఏవైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. భూములు అందుబాటులో ఉంటేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సాధ్యమవుతుందన్నారు. ఏపీఐఐసీ భూములు 22ఏ పరిధిలో ఉన్నాయని.. వాటిని నిషేధిత జాబితా నుంచి తప్పించాలన్నారు. ఈ ప్రక్రియ ఎస్‌ఐపీబీ సమావేశం ముగిసిన తర్వాత నిర్వహించాలి అన్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.

తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి