TTD Permanent Shelters For Bus Checking In Alipiri,తిరుమలకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేవారికి ఊరట.. గంటల తరబడి వేచి ఉండాల్సిన పనిలేదు – ttd approves new permanent shelters for bus checking in alipiri to ease traffic congestion to reach tirumala
Alipiri Permanent Shelters For Buses: టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి టోల్‌గేట్ దగ్గర ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ బస్సుల కోసం ప్రత్యేక లైన్లు నిర్మించనున్నారు. ఈ మేరకు రూ. 4.25 కోట్లతో శాశ్వత షెడ్లు నిర్మించాలని నిర్ణయించారు. రెండు రోజుల క్రితం పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బస్సుల కోసం ప్రత్యేక లైన్లు నిర్మిస్తే ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లే భక్తులు గంటలతరబడి వేచి ఉండాల్సిన పని ఉండదు.
హైలైట్:
అలిపిరిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టిన టీటీడీ
బస్సుల కోసం ప్రత్యేక లైన్లు నిర్మించాలని నిర్ణయం
రూ.4.25 కోట్లకు టీటీడీ నుంచి ఆమోదం
అలిపిరిలో టోల్ గేట్ వద్ద బస్సు షెల్టర్లు(ఫోటోలు– Samayam Telugu)
తిరుమల దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. పండుగలు, ప్రత్యేకమైన రోజులు, బ్రహ్మోత్సవాలు, వీకెండ్, వరుస సెలవులు, వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. ఈ ప్రభావం అలిపిరి టోల్‌గేట్ దగ్గర కనిపిస్తోంది.. వాహనాలను తనిఖీ చేసేందుకు గంటల తరబడి భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అందుకే తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. తిరుపతి నుంచి తిరుమల వెళ్లేందుకు అలిపిరి టోల్ గేట్ దగ్గర వాహనాల రద్దీని తగ్గించేందుకు టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బస్సుల తనిఖీల కోసం అలిపిరిలోని శ్రీ వినాయకస్వామి ఆలయ సమీపంలో రూ.4.25 కోట్లతో శాశ్వత షెల్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.అలిపిరి సప్తగిరి టోల్‌గేటు దగ్గర తిరుమల వెళ్లే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందుల్ని గమనించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల కోసం ప్రత్యేకంగా అలిపిరి వినాయక స్వామి ఆలయం సమీపంలో లైన్లు ఏర్పాటు చేసి,..ప్రయాణికులకు కోసం శాశ్వత షెడ్లు నిర్మించాలని టీటీడీ పాలకమండలిలో నిర్ణయం తీసుకుని ఆమోదించింది. మొత్తం రూ. 4.25 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రెండు ప్రత్యేక బస్సు లైన్లను 3.75 మీటర్ల వెడల్పుతో నిర్మాణం చేయనున్నారు. ఇక్కడ ఒకేసారి ఏకంగా 80 బస్సులు ఆగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రూ.2.02 కోట్లతో ప్రయాణికుల కోసం అత్యాధునిక శాశ్వత షెడ్లను 60 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. త్వరలో అలిపిరిలో నిర్మించే తనిఖీల లైన్ల కోసం లగేజీ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు, ప్రత్యేక విభాగాల ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు అక్కడ కొండ చరియలు విరిగిపడకుండా ఆర్‌సీసీ రిటెయినింగ్ వాల్, లైటింగ్, యూపీఎస్ ఏర్పాటు చేయనున్నారు.
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే వాహనాల కోసం ప్రస్తుతం అలిపిరి దగ్గర 13 లైన్ల టోల్‌ప్లాజా అందుబాటులో ఉంది. సాధారణ రోజుల్లో తిరుమలకు ఆరు వేల నుంచి ఎనిమిది వేల వాహనాలు వెళుతుంటాయి. తిరుమలలో పండగ రోజులు, వీకెండ్, బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు రద్దీ పెరుగుతుంది.. ఆ సమయంలో వాహనాల సంఖ్య 12 వేల వరకు ఉంటుటుంది. రద్దీ పెరిగిన సమయంలో అలిపిరి నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు బారులు తీరి ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి.. భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ అలిపిరి వినాయక స్వామి గుడి వద్ద ప్రత్యేక బస్సు లైన్లు నిర్మించనుంది. టోల్‌ప్లాజా ఎగ్జిట్ పాయింట్ నుంచి దాదాపు 600 మీటర్ల దూరంలోనే ఇది ఉంటుంది.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.
తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి