Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Sathi Leelavathi Movie Review: లావణ్య త్రిపాఠి కొత్త సినిమా.. సతీ లీలావతి రివ్యూ.. ఎలా ఉందంటే ??

9 May 2026

Weather Update: పగలు మండే ఎండలు.. సాయంత్రానికి చిరుజల్లులు

9 May 2026

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనం – Telugu News | Telangana Education Reform: Inter to Merge with School Education under One Board 2026 video tv9d

9 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»ఏపీ జైళ్లలో ఖైదీలకు రోజుకు కూలీ ఎంతో తెలుసా..? | Andhra Pradesh jail prisoners earnings per day details revealed by National Crime Records Bureau
తాజా వార్తలు

ఏపీ జైళ్లలో ఖైదీలకు రోజుకు కూలీ ఎంతో తెలుసా..? | Andhra Pradesh jail prisoners earnings per day details revealed by National Crime Records Bureau

.By .9 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఏపీ జైళ్లలో ఖైదీలకు రోజుకు కూలీ ఎంతో తెలుసా..? | Andhra Pradesh jail prisoners earnings per day details revealed by National Crime Records Bureau
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh

oi-Korivi Jayakumar

Time
Published: Saturday, May 9, 2026, 10:38 [IST]

ఆంధ్రప్రదేశ్ జైళ్ల పరిస్థితులపై జాతీయ నేర రికార్డుల బ్యూరో National Crime Records Bureau (NCRB) విడుదల చేసిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ వార్షిక నివేదిక-2024’ పలు కీలక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీలకు చెల్లిస్తున్న వేతనాలు దేశంలోని అనేక రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా సెంట్రల్ జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండటం, సిబ్బంది కొరత వంటి సమస్యలు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

రోజుకు రూ.160 మాత్రమే..

నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పని చేసే ఖైదీలకు రోజువారీ సగటు వేతనం కేవలం రూ.160 మాత్రమే అని సమాచారం. ఖైదీలు చేసే పనుల ఆధారంగా వారికి చెల్లింపులు జరుగుతున్నాయి. పూర్తిస్థాయి నైపుణ్యం ఉన్న ఖైదీలకు రోజుకు ₹200, కొంతమేర నైపుణ్యం ఉన్న వారికి ₹180 చొప్పున చెల్లిస్తున్నారు. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. కర్ణాటకలో ఖైదీలకు రోజుకు సగటున ₹524 చెల్లిస్తుండగా, హిమాచల్ ప్రదేశ్‌లో ₹400, జార్ఖండ్‌లో ₹290, తమిళనాడులో ₹240, బీహార్‌లో ₹196 చొప్పున వేతనం అందుతోంది.

andhra-pradesh-jail-prisoners-earnings-per-day-details-revealed-by-national-crime-records-bureau

జైళ్లలో ఉత్పత్తులు..

కాగా జైళ్లలో ఖైదీలు కేవలం శిక్ష అనుభవించడమే కాదు, పలు ఉత్పత్తుల తయారీలో కూడా పాల్గొంటున్నారు. ఫర్నిచర్, బేకరీ ఉత్పత్తులు, దుస్తులు, హస్తకళా వస్తువులు, స్టీల్ సామగ్రి, వ్యవసాయ ఉత్పత్తులు వంటి పలు వస్తువులను ఖైదీలు తయారు చేస్తున్నారు. వీటి విక్రయం ద్వారా ప్రభుత్వాలకు ఆదాయం కూడా లభిస్తోంది. ఈ విభాగంలో కేరళ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ జైళ్ల ఉత్పత్తుల ద్వారా ఏడాదికి ₹222.69 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ ₹11.11 కోట్ల ఆదాయంతో దేశవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచింది. జైళ్లలో తయారయ్యే ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలోని జైళ్ల మొత్తం సామర్థ్యం 8,659 మంది ఖైదీలకు మాత్రమే. అయితే 2024 డిసెంబర్ 31 నాటికి జైళ్లలో 7,861 మంది ఖైదీలు ఉన్నారు. మొత్తం సంఖ్య పరిమితిలోనే ఉన్నప్పటికీ, సెంట్రల్ జైళ్లలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్రంలోని ఐదు సెంట్రల్ జైళ్ల సామర్థ్యం 3,764 మందికి మాత్రమే ఉండగా, ప్రస్తుతం అక్కడ 4,698 మంది ఖైదీలు ఉన్నారు. అంటే సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండటం వల్ల రద్దీ తీవ్రస్థాయికి చేరింది. ఇది భద్రత, ఆరోగ్యం, నిర్వహణ పరంగా పెద్ద సవాలుగా మారిందని నిపుణులు చెబుతున్నారు.

అండర్ ట్రయల్ ఖైదీలే ఎక్కువ

జైళ్లలో ఉన్న వారిలో ఎక్కువ మంది ఇంకా కోర్టు విచారణ పూర్తికాని అండర్ ట్రయల్ ఖైదీలేనని నివేదిక వెల్లడించింది. మొత్తం ఖైదీల్లో 5,705 మంది అండర్ ట్రయల్స్ కాగా, శిక్ష పడిన ఖైదీలు 2,131 మంది మాత్రమే ఉన్నారు. అంటే విచారణలు ఆలస్యం కావడం వల్ల చాలా మంది సంవత్సరాల తరబడి జైళ్లలోనే ఉండాల్సి వస్తోందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. న్యాయ ప్రక్రియ వేగవంతం కావాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఖాళీ పోస్టులతో ఇబ్బందులు

ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో మొత్తం 2,637 పోస్టులు మంజూరై ఉన్నాయి. అయితే ప్రస్తుతం 797 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జైలు వార్డర్లు, భద్రతా సిబ్బంది, వైద్య సిబ్బంది, పరిపాలనా సిబ్బంది కొరత కారణంగా నిర్వహణలో సమస్యలు ఎదురవుతున్నాయని సమాచారం. సిబ్బంది కొరత కారణంగా ఖైదీల పర్యవేక్షణ, భద్రత, పునరావాస కార్యక్రమాల అమలు ప్రభావితమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

English summary

The ‘Prison Statistics Annual Report-2024’ released by the National Crime Records Bureau (NCRB) on the conditions of Andhra Pradesh prisons has brought to light several key aspects.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Sathi Leelavathi Movie Review: లావణ్య త్రిపాఠి కొత్త సినిమా.. సతీ లీలావతి రివ్యూ.. ఎలా ఉందంటే ??

9 May 2026

మోదీ పాదాభివందనం చేస్తున్న పెద్దాయన ఎవరో తెలుసా..!? | PM Modi took blessings and felicitated Makhanlal Sarkar, one of the most senior BJP workers in West Bengal

9 May 2026

Vijay Deverakonda : హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ.. తెరపైనే కాదు.. రియల్ లైఫ్ లోనూ నిజమైన హీరో..

9 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Sathi Leelavathi Movie Review: లావణ్య త్రిపాఠి కొత్త సినిమా.. సతీ లీలావతి రివ్యూ.. ఎలా ఉందంటే ??

9 May 2026

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన తొలి చిత్రం ‘సతీ లీలావతి’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ…

Weather Update: పగలు మండే ఎండలు.. సాయంత్రానికి చిరుజల్లులు

9 May 2026

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనం – Telugu News | Telangana Education Reform: Inter to Merge with School Education under One Board 2026 video tv9d

9 May 2026

లడ్డు కాదు, పులిహోర కాదు.. ఈ ఆలయంలో ప్రసాదంగా డబ్బే ఇస్తారు!

9 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Sathi Leelavathi Movie Review: లావణ్య త్రిపాఠి కొత్త సినిమా.. సతీ లీలావతి రివ్యూ.. ఎలా ఉందంటే ??

9 May 2026

Weather Update: పగలు మండే ఎండలు.. సాయంత్రానికి చిరుజల్లులు

9 May 2026

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనం – Telugu News | Telangana Education Reform: Inter to Merge with School Education under One Board 2026 video tv9d

9 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025499

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025459

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.