Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ ట్యాంకులు ఇవే.. | battletanks Top 10 Most Powerful Main in the World: A Look at Modern Armored Warfare and Firepower

15 April 2026

బైక్ పై ప్రయాణం.. 4 ఏళ్ల పిల్లలకూ తప్పనిసరిగా హెల్మెట్: సీపీ సజ్జనార్ వార్నింగ్ | hyderabad CP Sajjanar Mandates Helmets for Children Above 4 Years on Two-Wheelers to Ensure Safety

15 April 2026

RCB vs LSG IPL 2026 Result: కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్.. లక్నోపై విజయంతో టాప్ ప్లేస్ చేరిన ఆర్సీబీ..

15 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Visakhapatnam Honey Trap Case Sensational,పగలు మేకప్‌తో అందమైన రీల్స్, రాత్రి కాగానే అమ్మో.. విశాఖ హనీ ట్రాప్‌ కేసులో సంచలన విషయాలు – sensational updates revealed visakhapatnam honey trap case
ఆంధ్రప్రదేశ్

Visakhapatnam Honey Trap Case Sensational,పగలు మేకప్‌తో అందమైన రీల్స్, రాత్రి కాగానే అమ్మో.. విశాఖ హనీ ట్రాప్‌ కేసులో సంచలన విషయాలు – sensational updates revealed visakhapatnam honey trap case

.By .12 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Visakhapatnam Honey Trap Case Sensational,పగలు మేకప్‌తో అందమైన రీల్స్, రాత్రి కాగానే అమ్మో.. విశాఖ హనీ ట్రాప్‌ కేసులో సంచలన విషయాలు – sensational updates revealed visakhapatnam honey trap case
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

విశాఖపట్నం హనీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ కేసులో సూత్రధారిగా ఉన్న యువతితో పాటు ఆ గ్యాంగ్ ఎంతోమందిని ట్రాప్ చేసినట్లు తేలింది. ఆ గ్యాంగ్ చేతిలో తాను నరకం అనుభవించానని ఓ యువకుడు ఫోటోలతో సోషల్ మీడియాలో ఆరోపించారు. ఆ యువతి పగలు మేకప్ వేసుకుని.. రాత్రులు బ్రేకప్ చెబుతుందని చెబుతున్నారు. యువతి పైకి ప్రేమ నటిస్తూ తెర వెనుక బ్లాక్‌మెయిల్ డ్రామాలు నడిపింది. ఆమె అర్ధరాత్రి సమయంలో బాధితుల ఇంటికి పోలీసులతో వెళ్లి అరెస్టు చేయాలంటూ హడావిడి చేస్తున్నట్లు తేలింది.అంతేకాదు ఆ యువతి తన తల్లి గెజిటెడ్ ఆఫీసర్ అంటూ మాయ మాటలు చెప్పి అమాయకుల్ని మోసం చేస్తోంది. తనకు ఎంతోమంది ప్రభుత్వ ఉన్నతాధికారులతో పరిచయం ఉందని చెప్పుకుని.. చాలామందిని బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పది నెలల క్రితం ఓ వ్యాపారవేత్తను హనీ ట్రాప్ చేసి కేసు పెట్టించినట్లు గుర్తించారు. అప్పుడు ఆమె మోసాలను పోలీసులు గుర్తించలేకపోయారు.. యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఎంతోమందిపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వరుసగా ఫిర్యాదులు రావడంతో ఆమె మోసాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మోసాలు బయటపడుతున్నాయి.

ఆ యువతి పారిశ్రామికవేత్తలు, డబ్బున్నవాళ్లు, అధికారులు, ఎన్నారైలను టార్గెట్ చేసి మాయ మాటలు చెప్పి ట్రాప్ చేసేది. ఆమె అందమైన ఫోటోలను మొగ్గులోకి దింపేది.. ఆ వెంటనే రూమ్‌కు పిలిపించుకుని వారికి మత్తు మందు ఇచ్చి న్యూడ్ ఫోటోలు తీసి వారి నుంచి డబ్బులు వసూలు చేసింది. యువతి బాధితులు దాదాపు 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది.. వారిలో వ్యాపారవేత్తలు, ఎన్నారైలతో పాటు మరికొందరు ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు బాధితుల్లో కొంతమంది మాత్రమే బయటకు రాగా.. మరికొందరు తమ వివరాలు చెప్పకుండా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఇటీవల మరో ట్విస్ట్ బయటపడింది. ఓ యువకుడు తనపై అత్యాచారం చేశాడంటూ 10 నెలల కిందట బాధితుడిపై మద్దిలపాలెం పోలీసులుకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఇప్పుడు ఆ యువకుడు యువతిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుకావడం విశేషం. ఈ కేసులో యువతిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. విశాఖపట్నం మాత్రమే కాదు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా బాధితులు ఉన్నట్లు సమాచారం.

అలాగే ఆ యువతితో ఎవరు హానీట్రాప్ చేయించారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్‌లోని డేటా కీలకంగా మారగా.. ఆమె బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ పే వంటి నగదు లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. యువతి ఫోటో షూట్‌ల కోసం, రీల్స్ కోసం ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకోగా.. వారి గురించి ఆరా తీస్తున్నారు.. ఆమెతో ఉన్న గ్యాంగ్ వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. మొత్తానికి విశాఖపట్నం పోలీసులు ఈ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tenali Drugs From Bengaluru,ప్రైవేట్ బస్సు ద్వారా డ్రగ్స్ పార్శిల్.. తెనాలిలో కలకలం.. – drugs supplied from bengaluru to tenali via parcel on a private bus

15 April 2026

విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?

15 April 2026

Andhra: పెళ్లి రిసెప్షన్‌‌కి వచ్చి ఇంత పని చేశాడు ఏంటి..?

15 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ ట్యాంకులు ఇవే.. | battletanks Top 10 Most Powerful Main in the World: A Look at Modern Armored Warfare and Firepower

15 April 2026

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ ట్యాంకులు ఇవే.. | battletanks Top 10 Most Powerful Main in the…

బైక్ పై ప్రయాణం.. 4 ఏళ్ల పిల్లలకూ తప్పనిసరిగా హెల్మెట్: సీపీ సజ్జనార్ వార్నింగ్ | hyderabad CP Sajjanar Mandates Helmets for Children Above 4 Years on Two-Wheelers to Ensure Safety

15 April 2026

RCB vs LSG IPL 2026 Result: కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్.. లక్నోపై విజయంతో టాప్ ప్లేస్ చేరిన ఆర్సీబీ..

15 April 2026

Digital Payments: డిజిటల్ చెల్లింపులు చేసేవారు ఈ వార్తను తప్పకుండా చదవాల్సిందే..!

15 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ ట్యాంకులు ఇవే.. | battletanks Top 10 Most Powerful Main in the World: A Look at Modern Armored Warfare and Firepower

15 April 2026

బైక్ పై ప్రయాణం.. 4 ఏళ్ల పిల్లలకూ తప్పనిసరిగా హెల్మెట్: సీపీ సజ్జనార్ వార్నింగ్ | hyderabad CP Sajjanar Mandates Helmets for Children Above 4 Years on Two-Wheelers to Ensure Safety

15 April 2026

RCB vs LSG IPL 2026 Result: కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్.. లక్నోపై విజయంతో టాప్ ప్లేస్ చేరిన ఆర్సీబీ..

15 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025451

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.