జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఫలితాలు ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేసేందుకు ఎన్టీయే ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటన వెలువరించింది. అనంతరం జనవరి, ఏప్రిల్ సెషన్‌లలోని ఉత్తమ స్కోర్‌లతో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR)ను ఖరారు చేస్తారు. ఇక జేఈఈ మెయిన్‌లో తొలి 2.50 లక్షల ర్యాంకర్లు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా విద్యార్థులు NIT అడ్మిషన్లు పొందుతారు. అయితే ఎన్‌ఐటీల్లో కోర్సుల ఎంపికలో విద్యార్ధులు చాలా వరకు సంప్రదాయ కోర్సులైన కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ వంటి బ్రాంచ్‌లకే ఎక్కువగా పరిమితమవుతారు. అయితే గత మూడు సంవత్సరాలుగా అనేక NITలు కొన్ని కొత్త అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టాయి. వాటి గురించి తెలియని విద్యార్ధులు తమకు మరింత బాగా సరిపోయే సీటును వదులుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి మీ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న NITలలో ప్రవేశపెట్టిన కొన్ని కొత్త BTech ప్రోగ్రామ్‌లను ఇక్కడ అందిస్తున్నాం..
ఎన్‌ఐటీల్లో ప్రవేశ పెట్టిన కొత్త కోర్సులు ఇవే..
- ఎన్ఐటి ఢిల్లీ బీటెక్ — ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్
- ఎన్ఐటి ఢిల్లీ బీటెక్ — ఏరోస్పేస్ ఇంజనీరింగ్
- ఎన్ఐటి ఢిల్లీ బీటెక్ — విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ
- ఎన్ఐటి రూర్కెలా బీటెక్ — ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
- ఎన్ఐటి కురుక్షేత్ర బీటెక్ — ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (AIML)
- ఎన్ఐటి కురుక్షేత్ర సవరించిన బీటెక్ పాఠ్యప్రణాళిక
- ఎన్ఐటి సురత్కల్ (ఎన్ఐటికె) బీటెక్ — ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
- ఎన్ఐటి వరంగల్ బీటెక్ — డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
- ఎన్ఐటి కాలికట్ బీటెక్ — ఏఐ అండ్ డేటా సైన్స్‌లో ప్రత్యేకతతో కూడిన సీఎస్ఈ
- ఎన్ఐటి ట్రిచీ బీటెక్ — డేటా సైన్స్
- ఎన్ఐటి సిల్చార్ బీటెక్— సిఎస్ఇ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)
ఎన్ఐటి ఢిల్లీలో బీటెక్ — ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కోర్సు
ఎన్ఐటి ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 2023–24 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్‌లో ప్రామాణిక CSE కోర్‌తో పాటు మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు, డీప్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, బిగ్ డేటా సిస్టమ్స్ వంటి అంశాలు ఉంటాయి. JoSAA సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం ఈ ప్రోగ్రామ్‌లో ఢిల్లీ ఇతర రాష్ట్రాల కోటాలతో కలిపి ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 20 సీట్లు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ సాధారణ CSE డిగ్రీకి భిన్నమైనది.
ఎన్ఐటి ఢిల్లీ బీటెక్ — ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్స్
NIT ఢిల్లీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సు 2024లో 24 మంది విద్యార్థుల మంజూరైన ప్రవేశంతో ప్రారంభమైంది. అంతరిక్ష కార్యక్రమం సవాళ్లను ఎదుర్కోవడానికి విద్యార్థులను సిద్ధం చేయడానికి, ఈ రంగంలో ఆవిష్కరణ, సృజనాత్మకతను పెంపొందించడానికి దోహదం చేస్తుంది.
ఇవి కూడా చదవండి
NIT ఢిల్లీ బీటెక్ — వి.ఎల్.ఎస్.ఐ డిజైన్ మరియు టెక్నాలజీ కోర్సు
NIT ఢిల్లీ తన అధికారిక JoSAA ప్రొఫైల్ ద్వారా ప్రకటించిన డేటా ప్రకారం ఈ ప్రోగ్రామ్ 2024–25 విద్యా సంవత్సరంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌తో పాటు ప్రారంభించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో డివైస్ ఫిజిక్స్ అండ్ సర్క్యూట్ డిజైన్ నుండి వెరిఫికేషన్, లేఅవుట్ అండ్ ఫ్యాబ్రికేషన్ ప్రక్రియల వరకు చిప్ డిజైన్ పూర్తి సిలబస్ కవర్ చేస్తుంది. గత సంవత్సరం JoSAA సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం హోమ్-స్టేట్, ఇతర-స్టేట్ కోటాల కింద సుమారు 25 సీట్లను కేటాయించారు.
NIT రూర్కెలా BTech — ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు
ఎన్ఐటి రూర్కెలాలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం కింద 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బీటెక్ కోర్సును ప్రవేశపెట్టింది. కంప్యూటర్ సైన్స్ సూత్రాలను అనేక రకాల రంగాలలో అనువర్తించగలిగేలా సిద్ధం చేయడానికి ఈ కోర్సును డిజైన్ చేశారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ కంప్యూటింగ్, ప్యారలల్ అల్గారిథమ్స్, డేటాబేస్ ఇంజనీరింగ్, కంప్యూటర్ నెట్‌వర్క్‌లు, ఇమేజ్ ప్రాసెసింగ్ వంటి అంశాలను కవర్ చేసే ట్యాబ్‌లు ఉంటాయి. AI ప్రోగ్రామ్‌లో 45 సీట్లు ఉన్నాయి. JEE మెయిన్ ర్యాంక్ ఆధారంగా JoSAA, CSAB కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రోగ్రామ్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సు. 1987 నుంచి డిపార్ట్‌మెంట్ అందిస్తున్న రెగ్యులర్ CSE ప్రోగ్రామ్‌కు ఈ కోర్సు పూర్తి భిన్నంగా ఉంటుంది.
NIT కురుక్షేత్ర బీటెక్ — ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సు
ఎన్ఐటి కురుక్షేత్రలోని కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగం 2023–24 విద్యా సంవత్సరం నుంచి 60 సీట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. కంప్యూటర్ సైన్స్‌లోని కీలక రంగాలను ఈ కోర్సు్లో విద్యార్ధులకు అందిస్తారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌లోని ప్రాథమిక భావనలు, తాజా పురోగతులను కూడా అందిస్తుంది.
NIT కురుక్షేత్ర బీటెక్ — ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కోర్సు
ఎన్ఐటీ కురుక్షేత్రలోని కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగం 2024–25 విద్యా సంవత్సరం నుంచి 60 సీట్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్‌లో ప్రత్యేక టీటెక్ కోర్సును ప్రారంభించింది. ఇది ప్రత్యేక సిలబస్‌తో కూడిన ఒక ప్రత్యేక ప్రోగ్రామ్. ఈ ఏఐ, డిఎస్ ప్రోగ్రామ్, ఏఐ కోర్‌తో పాటు డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా పైప్‌లైన్‌లు, స్టాటిస్టికల్ మోడలింగ్ అండ్ లార్జ్-స్కేల్ డేటా సిస్టమ్స్‌పై విద్యార్ధులకు పూర్తి అవగాహనను అందిస్తుంది.
NIT సూరత్కల్ బీటెక్ — ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు
ఎన్ఐటి సూరత్కల్ లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం.. బిటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రోగ్రామ్ కు వేరుగా బిటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును నిర్వహిస్తుంది. మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, డేటా విజువలైజేషన్ టెక్నాలజీలను ఉపయోగించి యంత్రాలు, సాఫ్ట్‌వేర్, అప్లికేషన్‌లను రూపొందించడానికి విద్యార్థులకు ఉపయోగపడుతుంది.
NIT వరంగల్ బీటెక్ — డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు
NIRF ఇంజనీరింగ్ ర్యాంకింగ్స్ 2024లో 21వ స్థానంలో నిలిచిన NIT వరంగల్ 2024–25 నుంచి డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో BTechను అందిస్తుంది. JoSAA సీట్ మ్యాట్రిక్స్‌లో దీనిని కొత్త బ్రాంచ్ మార్పు చేసింది. JEE మెయిన్ AIR ఆధారంగా JoSAA కౌన్సెలింగ్ ద్వారా ఇందులో ప్రవేశాలు జరుగుతాయి.
NIT కాలికట్ బీటెక్ — ఏఐ మరియు డేటా సైన్స్ స్పెషలైజేషన్‌తో కూడిన సీఎస్ఈ కోర్సు
ఎన్ఐటి కాలికట్ 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్‌పై దృష్టి సారించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రోగ్రామ్ CSE విభాగం పరిధిలో పూర్తి నాలుగు సంవత్సరాల బిటెక్ కోర్సుగా అందించబడుతుంది. జేఈఈ మెయిన్, జోసా కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
NIT తిరుచిరాపల్లి బీటెక్ — డేటా సైన్స్ కోర్సు
NIRF ఇంజనీరింగ్ ర్యాంకింగ్స్ 2025లో 9వ స్థానంలో నిలిచి దేశంలోనే అగ్రశ్రేణి NITగా కొనసాగుతున్న NIT ట్రిచీ 2025–26 విద్యా సంవత్సరం నుంచి డేటా సైన్స్‌లో BTechను ఒక కొత్త ప్రోగ్రామ్‌గా తీసుకువచ్చింది. డేటా సైన్స్ ప్రోగ్రామ్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సు. JEE మెయిన్, JoSAA ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
NIT సిల్చార్ బీటెక్ — సి.ఎస్.ఇ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కోర్సు
ఎన్ఐటి సిల్చార్‌లో ఇప్పటికే అందిస్తున్న సాధారణ CSE ప్రోగ్రామ్‌కు భిన్నంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ను అందిస్తుంది. ఇందులో సుమారు 30 సీట్లతో 2023 నుంచి JoSAA సీట్ మ్యాట్రిక్స్‌లో కొనసాగిస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

