Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

850కు లోక్ సభ సీట్లు-2029కి మహిళా రిజర్వేషన్లు..! కేంద్రం బిగ్ ప్లాన్ వెల్లడి..! | Lok Sabha to Expand to 850 Seats Based on 2011 Census to Fast-Track Women’s Quota by 2029

14 April 2026

ఆంధ్రా స్టైల్ వంకాయ బొమ్మిడాయిల పులుసు.. తింటే, గిన్నె మొత్తం ఖాళీ అవ్వాలసిందే

14 April 2026

నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధం.. ఇండియా కూటమి నేతల కీలక భేటీ..!

14 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tiruchanur Tourist Bus Stand Auction,తిరుచానూరులో బస్ఠాండ్ వేలం.. పోటీపడిన కాంట్రాక్టర్లు, రూ.3.15 కోట్లు పలికింది – tiruchanur tourist bus stand auction completed for 2026 2027
ఆంధ్రప్రదేశ్

Tiruchanur Tourist Bus Stand Auction,తిరుచానూరులో బస్ఠాండ్ వేలం.. పోటీపడిన కాంట్రాక్టర్లు, రూ.3.15 కోట్లు పలికింది – tiruchanur tourist bus stand auction completed for 2026 2027

.By .14 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tiruchanur Tourist Bus Stand Auction,తిరుచానూరులో బస్ఠాండ్ వేలం.. పోటీపడిన కాంట్రాక్టర్లు, రూ.3.15 కోట్లు పలికింది – tiruchanur tourist bus stand auction completed for 2026 2027
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tiruchanur Tourist Bus Stand Auction Update: తిరుచానూరు టూరిస్ట్‌ బస్టాండ్‌‌కు సంబంధించి ప్రతి ఏటా వేలం పాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2026-2027కు సంబంధించిన వేలం పాటూ కూడా పూర్తి చేశారు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ కొనసాగింది. కిరణ్ రెడ్డి రూ.3.1 కోట్లకు వేలంలో దక్కించుకున్నారు. తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్‌లో పార్కింగ్ రుసుము వసూలు చేసేందుకు ఈ వేలం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.

హైలైట్:

  • తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్ వేలం ప్రక్రియ పూర్తి
  • రూ.31.5 కోట్లకు దక్కించుకున్న కాంట్రాక్టర్ కిరణ్ రెడ్డి
  • ప్రతి ఏటా పార్కింగ్ రుసుము వసూలు చేసేందుకు వేలం
Tiruchanur Tourist Bus Stand
తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్ వేలం(ఫోటోలు– Samayam Telugu)
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు కచ్చితంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళతారు. శ్రీవారి
భక్తులకు ప్రాముఖ్యం ఉన్న తిరుచానూరు బస్టాండ్‌కు ప్రతి ఏటా వేలంపాట నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ప్రైవేట్ టూరిస్ట్ బస్టాండ్‌లో పార్కింగ్ రుసుము వసూలు చేసేందుకు అధికారుల ఆధ్వర్యంలో వేలం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేలంలో బస్టాండ్‌కు సంబంధించి కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి చాలామంది పోటీపడతారు. ఈ ఏడాది కూడా పోటీ నిర్వహించగా కాంట్రాక్టర్లు పోటీపడ్డారు. ముందస్తు జాగ్రత్తగా టూరిస్ట్ బంస్టాండ్ దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.డీఎల్‌పీవో సురేష్‌నాయుడు, డిప్యూటీ ఎంపీడీవో దయాసాగర్‌, పంచాయతీ కార్యదర్శి మణి ఆధ్వర్యంలో వేలం పాటను నిర్వహించగా.. ఈ ఏడాది వేలం పాటలో టూరిస్ట్ బస్టాండ్‌ భారీగా పలికింది. ఈ కాంట్రాక్ట్‌ను కిరణ్‌రెడ్డి అనే వ్యక్తి రూ.3,15,40,000కు దక్కించుకున్నాడు. వాస్తవానికి మార్చి 31తో టూరిస్టు బస్టాండులో రుసుము వసూలు చేసేందుకు కాంట్రాక్టర్‌కు గడువు ముగిసింది. ఏప్రిల్ 1 నుంచి పంచాయతీ అధికారులు పార్కింగ్ రుసుము వసూలు చేశారు. ఈ క్రమంలో వేలం పాట నిర్వహించారు.. అయితే కొత్త కాంట్రాక్టర్‌కు ఈ నెల 20 తర్వాతే బస్టాండ్ అప్పగిస్తారని.. 11 నెలలు మాత్రమే రుసుం వసూలు చేసుకునేందుకు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. గతేడాది తిరుచానూరు టూరిస్టు బస్టాండు వేలంలో రూ.3.51కోట్లు పలికింది.. గతేడాదితో పోలిస్తే ఈసారి తగ్గింది.

గతేడాది తిరుచానూరు టూరిస్ట్‌ బస్టాండ్‌ వేలంలో తీవ్ర ఉధ్రిక్తతకు దారితీసింది. ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకునేందుకు రెండు వర్గాలు పోటీపడ్డాయి. అక్కడ టెండర్లు వేయడానికి వచ్చిన వారిని ఓ వర్గం అడ్డుకుంది.. టెండర్ పేపర్లను లాక్కుని పారిపోవడంతో.. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత వేలం పాట ప్రక్రియను చేపట్టారు.. వెంకటేషన్ అనే వ్యక్తికి వేలం దక్కింది. అయితే గతేడాది ఉద్రిక్తతల మధ్య సాగిన వేలం పాట ప్రక్రియ ఈ ఏడాది మాత్రం సాఫీగా జరిగింది.. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.

తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి