Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

నెక్ట్స్ భారత్- పాకిస్థాన్ యుద్ధం..? ఈసారి మరింత ప్రమాదకరంగా..? ఊహకందని విధ్వంసం..! | india Pakistan War Future Will Be More Dangerous and Rapid Than Ever Before, Experts Warn India

5 May 2026

SRH vs PBKS: పంజాబ్‌తో కీలక మ్యాచ్‌.. హైదరాబాద్ జట్టుకు గుడ్‌న్యూస్.. ఆ డేంజరస్ ప్లేయర్ రీఎంట్రీ?

5 May 2026

Coconut Water Benefits: కొబ్బరి నీళ్ళు లేదా చెరకు రసం? వేసవిలో ఏది ఎక్కువ ప్రయోజనకరం?

5 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap High Court On Akividu Ramalayam,ఆకివీడు రామాలయ నిర్మాణం.. హైకోర్టు కీలక నిర్ణయం.. పిటిషన్ కొట్టివేత – ap high court dismisses petition challenging the granting of permissions for ramalayam construction in akividu
ఆంధ్రప్రదేశ్

Ap High Court On Akividu Ramalayam,ఆకివీడు రామాలయ నిర్మాణం.. హైకోర్టు కీలక నిర్ణయం.. పిటిషన్ కొట్టివేత – ap high court dismisses petition challenging the granting of permissions for ramalayam construction in akividu

.By .5 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap High Court On Akividu Ramalayam,ఆకివీడు రామాలయ నిర్మాణం.. హైకోర్టు కీలక నిర్ణయం.. పిటిషన్ కొట్టివేత – ap high court dismisses petition challenging the granting of permissions for ramalayam construction in akividu
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పెదపేటలో రామాలయ నిర్మాణంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయం నిర్మాణానికి అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. రామాలయం నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంపై కొంతమంది ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. గత 80 ఏళ్లుగా ఆకివీడు పెదపేటలో రామాలయం ఉన్నట్లు రికార్డుల్లో ఉందని పేర్కొంది. అన్ని రికార్డులు, ఆధారాలను పరిశీలించిన తర్వాతే రామాలయ నిర్మాణానికి అధికారులు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్‌ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.

హైలైట్:

  • ఆకివీడు రామాలయం నిర్మాణంపై హైకోర్టులో పిటిషన్
  • అనుమతులు మంజూరు చేయటంపై సవాల్ చేసిన పిటిషనర్లు
  • పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు
akividu
ఆకివీడు రామాలయం పిటిషన్ కొట్టేసిన హైకోర్టు(ఫోటోలు– Samayam Telugu)
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో రామాలయ పునర్నిర్మాణానికి అడ్డంకులు తొలుగుతున్నాయి. రామాలయ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొంతమంది పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. పిటిషన్ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. పెదపేటలో రామాలయం 80 ఏళ్లుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉందని.. రికార్డులు పరిశీలించిన మీదటే అధికారులు అనుమతి ఇచ్చారని విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ల వాదనను తోసిపుచ్చుతూ పిటిషన్ కొట్టివేసింది. మరోవైపు ఆకివీడులో రామాలయ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో గతంలో పిల్ దాఖలైంది. ఈ పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషన్‌ను డిస్మోజ్ చేసింది. అయితే పిల్‌ను ఉపసంహకరించుకున్నట్లు పిటిషనర్లు కోర్టు తెలిపారు. తాజాగా రామాలయ నిర్మాణానికి అధికారులు ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ రిట్‌ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అన్ని ఆధారాలు, రికార్డులు పరిశీలించిన తర్వాతనే కలెక్టర్, నగర పంచాయితీ కమిషనర్ అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేస్తూ పిటిషన్ కొట్టివేసింది.

మరోవైపు ఆకివీడులో రామాలయం అంశం గత కొంతకాలంగా ఏపీలో చర్చనీయాంశంగా ఉన్న సంగతి తెలిసిందే. శ్రీరామనవమి సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అక్కడ పర్యటించటం, ఈ సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తతలతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆకివీడు పెదపేటలోని పురాతన రామాలయాన్ని పునర్నిర్మిస్తామని రఘురామ చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్న మరో వర్గం మాత్రం రామాలయం నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తమకు గొంతెనమ్మ ఆలయాన్ని నిర్మించాలని కోరుతోంది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం కోర్టుకు చేరగా.. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే.. ఆకివీడులో నిర్మాణాలైనా, తొలగింపులైనా చేపట్టాలని కోర్టు స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే ప్రభుత్వ యంత్రాంగం నుంచి అన్ని అనుమతులు రావటంతో ఇటీవల రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది. రఘురామ దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి